Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జడ్జీల నియామకా నికి సంబంధించిన కొలీజయం వ్యవస్థపై సుప్రీంకోర్టు, కేంద్రానికి మధ్య మాటల యుద్ధం కొన సాగుతున్నది. తాజాగా పార్లమెంటు లో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి కొలీజియం వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. జడ్జీల నియామకంలో ప్రభుత్వానికి పరిమిత పాత్ర అని, అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... కొలీజియం వ్యవస్థపై విమర్శలు చేశారు. న్యాయమూర్తుల ఖాళీల కారణంగా దాదాపు ఐదు కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయనీ, ఇది ఆందోళన కలిగించే అంశమని అన్నారు. పెండింగ్ కేసులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందనీ, అయితే న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వానికి చాలా పరిమిత పాత్ర ఉందని అన్నారు. కొలీజియం పేర్లను ఎంచుకుంటుంది... అయితే జడ్జీలను నియమించే హక్కు కేంద్రానికి లేదని అన్నారు. నాణ్యత, భారతదేశ వైవిధ్యాన్ని ప్రతిబింబించే విధంగా, మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించే పేర్లను పంపాలని ప్రభుత్వం తరచుగా భారత ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తులకు తెలిపామని అన్నారు.