Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం, నాలుగు రాష్ట్రాలతో సహా పీపీఏకి...
న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు పర్యావరణ ఉల్లంఘనలపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ తీర్పును సవాల్ చేస్తూ సామాజిక వేత్త పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేషన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ పర్యావరణ, అనుమతులు, పట్టిసీమ, పురుషోత్తపట్నం, పోలవరం డ్యాం వద్ద కొత్త లిఫ్ట్ పథకం ఉల్లంఘనలను లేవనెత్తారు. అంతే కాకుండా కాఫర్‌డ్యామ్ కారణంగా తరచుగా వరదలను పెరిగాయని వాదించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిషేధ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కూడా లేవనెత్తారు. అనంతరం ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)లకు నోటీసు జారీ చేశారు. ఈ పిటిషన్‌ను ఇప్పటికే నోటీసులు జారీ చేసి మరో పిటిషన్‌కు జత చేసింది.