Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్-2023 పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. ఈ మేరకు జేఈఈ మెయిన్ 2023 నోటిఫికేషన్ ను జాతీయ పరీక్షల మండలి గురువారం విడుదల చేసింది. జేఈఈ మెయిన్ పరీక్షలను రెండు విడతల్లో నిర్వహిస్తున్న ఎన్టీఏ. జనవరిలో తొలి విడత, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. తొలి సెషన్‌ను జనవరి 24, 25, 27, 29, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనుండగా.. రెండో సెషన్ ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరుగుతుందని ఎన్టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్ పరీక్షను 13 భాషల్లో (ఆంగ్లం, హిందీ, తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిశా, పంజాబీ, తమిళ్, ఉర్దూ) నిర్వహించనున్నారు.
తొలి సెషన్ రిజిస్ట్రేషన్ల కోసం ...
తొలి సెషన్ పరీక్షకు నేటి (డిసెంబర్ 15) నుంచి జనవరి 12 రాత్రి 9గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు జనవరి 12 రాత్రి 11.50 నిమిషాల వరకు గడువు విధించారు. ఏ సిటీలో పరీక్ష నిర్వహిస్తామనేది జనవరి రెండో వారంలో ప్రకటించనున్నారు. అడ్మిట్ కార్డులను జనవరి మూడో వారంలో ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.