Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2022లో 6.5లక్షల మందికి స్టూడెంట్ వీసాలు
న్యూఢిల్లీ: విదేశీ విద్య కోసం భారతీయ విద్యార్థులు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ నాటికి 6.5లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిపోయారు. భారత విదేశాంగ శాఖలోని 'బ్యూరో ఇమ్మిగ్రేషన్' తన నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ నివేదిక ప్రకారం, నవంబర్ 30నాటికి స్టూడెంట్ వీసాలతో 6,48,678 మంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. కెనడా, బ్రిటన్లో భారతీయ విద్యార్థుల సంఖ్య ప్రతిఏటా పెరుగుతోంది. 2022నాటికి కెనడాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 6.60 లక్షకు చేరుకుంది. ఉన్నత చదువు నిమిత్తం అత్యధిక మంది విద్యార్థులు కెనడా, బ్రిటన్లను తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారు. అయితే ప్రతి ఏటా విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరగటం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం, విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య కరోనా ముందునాటి స్థితికి చేరుకుంది. వర్తక, వాణిజ్యం, ఉపాధి, తీర్థయాత్రలు, వైద్యం, సందర్శకులు, పర్యాటకులకు ఇచ్చే వీసాల గణాంకాలన్నీ 'బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్' నమోదుచేస్తోంది.