Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 36 లక్షలకు పైగా కేసులు పెండింగ్లోనే
- జిల్లా, దిగువ కోర్టుల్లో ఇదీ తీరు
- హైకోర్టుల్లో మూడు లక్షలకు పైగానే..!
- లోక్సభలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, అకృత్యాల విషయంలో సత్వర లేదా తగిన న్యాయం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కారణం.. మహిళలకు సంబంధించిన 36 లక్షలకు పైగా కేసులు దేశంలోని జిల్లా న్యాయస్థానాలు, దిగువ కోర్టుల్లో పెండింగ్లో ఉండటమే. ఉన్నత న్యాయస్థానాలైన హైకోర్టుల్లో ఈ సంఖ్య మూడు లక్షలుగా ఉండటం ఈ పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. లోక్సభలో కేంద్రం వెల్లడించిన సమాచారం ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్రం వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2014 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 15 నాటికి మహిళ ద్వారా దాఖలు చేయబడిన వాటిలో 36 లక్షలకు పైగా కేసులు పెండింగ్లోఉన్నాయి. జిల్లా న్యాయస్థానాలు, సబ్ ఆర్డినేట్ కోర్టుల్లో పెండింగ్లో ఈ ఉన్న కేసులు తీర్పులు వెలువడక పోవడంతో పేరుకుపోయి ఉన్నాయి. అలాగే, దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టు ల్లో పెండింగ్లో ఉన్న ఈ కేసుల సంఖ్య మూడు లక్షలకు పైగా ఉన్నది. 16 మంది ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానాన్ని వెల్లడించింది. మహిళలపై నేరాలకు సంబంధించిన సమాచారాన్ని సుప్రీంకోర్టు నిర్వహించడం లేదనీ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఇక మూడు లక్షలకు పైగా పెండింగ్లో ఉన్న కేసులు అత్యధికంగా రాజస్థాన్ హైకోర్టులో (61,849) ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ హైకోర్టు (57,319), బాంబే హైకోర్టు (51,444) లు ఉన్నాయి. ఇక జిల్లా, దిగువ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు అత్యధికంగా యూపీలో (7,80,578) ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (3,83,463), బీహార్ (3,77,885)లు ఉన్నాయి.