Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జీతాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం లక్ష్మారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారని తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్‌కు సంబంధించిన జీతాల కోసం రూ.9.28 కోట్లు విడుదల చేశామని వివరించారు. వారికి ఒక పీరియెడ్‌కు రూ.390 చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. అంటే నెలకు గరిష్టంగా 72 పీరియెడ్లు మాత్రమే వారు బోధించాల్సి ఉంటుందని వివరించారు. ఈలెక్కన వారికి నెలకు రూ.28,080 మించకుండా గౌరవ వేతనం వస్తుందని తెలిపారు.