Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వ్యక్తిగత డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్‌పై అభిప్రాయ సేకరణ గడువును జనవరి 2 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పలువురు వాటాదారుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ బిల్లుపై సంప్రదింపులు, అభిప్రాయాల వెల్లడి కోసం డిసెంబర్ 17 తుది గడువుగా తొలుత ప్రకటించింది. దీన్ని పొడిగిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. అభిప్రాయాలను మైగౌట్ పోర్టల్ లేదా మంత్రిత్వ శాఖ అధికార ఇ-మెయిల్‌కు పంపడానికి వీలుందని తెలిపింది. ఈ ఏడాది నవంబర్ 18న కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ డేటా పరిరక్షణ బిల్లు ముసాయిదాను ప్రజాభిప్రాయ సేకరణకు విడుదల చేసింది.