Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దోషుల ముందస్తు విడుదలపై సవాలు పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: గుజరాత్ మత ఘర్షణల సమయంలో హిందూత్వ గూండాల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు బిల్కిస్ బానోకు న్యాయం దక్కలేదు. 2002లో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై హిందూత్వ దుండగులు సామూహిక అత్యాచా రానికి పాల్పడ్డారు. ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసులో దోషులను ముందస్తుగా విడుదల చేసిన నేపథ్యంలో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. ఈ కేసులో దోషులకు రెమిషన్ పాలసీని అమల్జేసేందుకు వీలు కల్పిస్తూ మే నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బిల్కిస్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా ఆ పిటిషన్‌ను కొట్టివేసి.. ఆమె న్యాయవాదికి సుప్రీంకోర్టు సిబ్బంది సమాచారం చేరవేశారు. ఈ కేసులో 11 మందిని దోషులుగా నిర్ధారించిన సిబిఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. బాంబే హైకోర్టు కూడా దీన్ని సమర్థించింది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆగస్టు 15న వీరందరినీ గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడం తీవ్ర దుమారం రేపింది. జైలు నుంచి బయటకు వచ్చిన వారిని మిఠాయిలు, పూలదండలతో సంఫ్‌ు పరివార్ ఘనంగా స్వాగతించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై పునర్విచారణ చేపట్టి సదరు దుండగులను తిరిగి జైళ్లకు పంపాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. బిజెపి, దాని మిత్రపక్షాలు మినహా రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు ముక్తకంఠంతో దోషుల విడుదలను ఆక్షేపించాయి. ఈ నేపథ్యంలో రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది.