Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మౌలానా ఆజాద్ ఫెలోషిప్ నిలుపుదలపై విద్యార్థిలోకం
- క్యాంపస్‌లు, బయటా నిరసనలు
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ సర్కారు తీరు పేద విద్యార్థులకు శాపంగా మారుతున్నది. స్కాలర్‌షిప్‌లకు బ్రేక్ వేస్తూ వారిని చదువు దూరం చేస్తున్నది. భారత దేశ మొదటి విద్యాశాఖ మంత్రి పేరు మీద ఉన్న ఫెలోషిప్‌ను ఈ విధంగానే ముగించింది మోడీ సర్కారు. దీనిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనను తెలిపారు. విద్యార్థుల నిరసణలకు విద్యావేత్తలు, నిపుణులు, రాజకీయ పార్టీల నాయకులూ మద్దతు పలికారు. ముఖ్యంగా పేద, మధ్య, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులు మోడీ సర్కారు తీరుతో తీవ్రంగా నష్టపోతున్నారని విశ్లేషకులు, నిపుణులు చెప్పారు. ఆస్ మొహమ్మద్ (25) తండ్రి ఢిల్లీలో బస్ డ్రైవర్‌గా పని చేశాడు. కోవిడ్-19 సమయంలో డ్రైవర్‌గా ఉద్యోగాన్ని ఆయన తండ్రి కోల్పోయాడు. దీంతో మొహమ్మద్‌పై ఆర్థికం గా తీవ్ర భారం పడింది. అయితే, తాను 2019లో సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీని పొందాననీ, పాఠశాల, కళాశాల ద్వారా పొందిన ప్రభుత్వ స్కాలర్షిప్లతోనే ఇది సాధ్యమైందని చెప్పాడు. తాను మరింత ముందుకు వెళ్లగలననీ, కళాశాల ప్రొఫెసర్ కావాలనే తన కలను కొనసాగించగలనని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈయన జాతీయ అర్హత పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం యువ పండితులను ఎంపిక చేయటానికి ఏటా దీనిని నిర్వహిస్తారు. పరీక్షకు హాజరైన లక్షలాది మందిలో ప్రతి ఏడాది 25 వేల మంది మాత్రమే ఫెలోషిప్‌ను పొందుతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. మతపరంగా మైనారిటీల కు చెందినవారికి ఉపయోగపడే మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్‌ను పొందడం పట్ల మొహమ్మద్‌కు మరింత నమ్మకం ఉన్నది. కానీ, మోడీ సర్కారు మాత్రం గత వారం దానిని నిలిపివేయడం గమనార్హం. కేంద్రం తీరు మొహమ్మద్ వంటి వారి ఎందరో అభ్యర్థులు ఆశలు, కలలపై నీళ్లు చల్లిందని విద్యావేత్తలు, విద్యార్థి నాయకులు తెలిపారు. దేశంలోని ముస్లింలు, ఇతర వర్గాల మధ్య విద్యాపరమైన అంతరాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్ధిష్ట చర్యలు తీసుకోవాలని ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు చేసిన తర్వాత 2009లో మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ ప్రారంభించబడింది. 2019లో నిర్వహించిన ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకారం.. దేశ జనాభాలో ముస్లింలు 14.2 శాతం మంది ఉన్నారు. అయితే, దేశంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో చేరినవారిలో కేవలం 5.5 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్.. భారతదేశం మొదటి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ పేరు మీద పెట్టారు. ఇది భారత్‌లోని అన్ని మతపరమైన మైనారిటీలకు ఉపయుక్తమైనది. అయితే, దీని ద్వారా లబ్ది పొందే వర్గంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. 2018-19 ప్రభుత్వ సమాచారం ప్రకారం ప్రతి 1000 మందిలో 733 ముస్లిములే ఉన్నారు. మతపరమైన రాజకీయాలకు అలవాటు పడిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ఈ ఫెలోషిప్‌ను రద్దు చేయడానికి ఇదే కారణమై ఉండొచ్చని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఫెలోషిప్‌ను నిలిపివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యార్థుల్లో ఆగ్ర హాన్ని తెప్పించింది. క్యాంపస్‌ల లోపల, వెలుపల విద్యార్థి సంఘాల నుండి నిరసనలకు ఆజ్యం పోసింది. సామాజిక కార్యకర్తలు మోడీ సర్కారు తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇది మైనారిటీల విద్యా అవకాశాలపై దాడిగా అభివర్ణించారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మైనారిటీ వ్యతిరేక విధానాల్లో భాగంగానే ఈ ఫెలోషిప్‌ను రద్దు చేశారని తెలిపారు. ఫెలోషిప్‌ను పునరుద్ధరించా లంటూ విద్యార్థులు తీవ్రంగా పోరాడుతున్నారు. ఈ మేరకు ఈనెల 12న ఢిల్లీలోని విద్యా మంత్రిత్వ శాఖ కార్యాలయం బయట పలు విద్యార్థి సంఘా లకు చెందిన అనేక మంది నాయకులు ప్రదర్శన సైతం నిర్వహించారు. భారీగా పోలీసు బలగాలను మోహరించి విద్యార్థుల నిరసనలను ప్రభుత్వం అడ్డుకున్నది. ఫెలోషిప్ రద్దు నిర్ణయాన్ని కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇటు కేంద్రం తీరును ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.