Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వందలాది మంది ప్రాణాలు బలిగొంటోంది
- సిజెఐ జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన
న్యూఢిల్లీ : దేశంలో కుల దురహంకార జాఢ్యం ప్రమాదకర సమస్యగా మారిందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రతి యేటా వందల సంఖ్యలో యువ కులు బలైపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రేమ వివాహాలు, కులాంతర వివాహం చేసుకోవడం, వారి కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవడంతో దురహంకార హత్యలు జరుగుతున్నాయని తెలిపారు. మాజీ అటార్నీ జనరల్ అశోక్ దేశారు 90వ జయంతి సందర్భంగా ముంబయిలో శనివారం జరిగిన 'లా అండ్ మోరాలిటీ' కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ ప్రత్యేక అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నైతికతతో ముడిపడిన బ్రెస్ట్ ట్యాక్స్, స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే 377 సెక్షన్, ముంబయి బార్ డ్యాన్స్‌పై నిషేధం, వ్యభిచారం తదితర కేసులు గురించి ప్రస్తావిస్తూ లీగల్ న్యూస్‌వెబ్‌సైట్ 'బార్ అండ్ బెంచ్' రాసిన కథనాన్ని ఆయన ఉటంకిం చారు. దాని ప్రకారం..పెత్తందారి సామాజిక తరగతులు, సముహాలు.. బలహీన తరగతులు, తెగలపై ఆధిపత్యం చలాయించేందుకు ఉద్దేశించిన ప్రవర్తనా నియమావళే 'నైతికత'గా చలామణి అవుతోంద న్నారు. 'నాకు ఏది నీతి అనిపిస్తుందో.. ఆ నైతికత మీకుండాల్సిన అవసరం ఉందా?' అని ఆయన ప్రశ్నించారు.
1991లో ఉత్తరప్రదేశ్‌లో 15 ఏళ్ల బాలికను ఆమె తల్లిదండ్రులు ఎలా చంపారో విశ్లేషించే ఒక కుల దురహంకార హత్యకు సంబంధించిన కథనాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. వారి ప్రకారం బాలిక సమాజానికి వ్యతిరేకంగా అడుగు పెట్టిందని, దానిని గ్రామస్థులు నేరంగా పరిగణించారని తెలిపారు. గ్రామస్తులు నేరాన్ని అంగీకరించారని ఆ కథనం పేర్కొంది. వారు నివసించిన సమాజంలోని ప్రవర్తనా నియమా వళికి కట్టుబడి ఉన్నందున వారి చర్యలు (వారికి) ఆమోదయోగ్య మైనవని.. ఆ చర్యలు సమర్థించుకున్నారని తెలిపారు. బలహీనమైన, అట్టడుగు సామాజిక తరగతులకు చెందిన ప్రజలు..ఆధిపత్య సమూహా లకు లొంగిపోవలసి వస్తుందనీ ఆందోళన వ్యక్తం చేశారు. అణచివేత కారణంగా వారు ప్రత్యామ్నాయ సంస్కృతిని అభివృద్ధి చేయలేరని సిజెఐ ఆవేదన వ్యక్తం చేశారు. అట్టడుగు తరగతుల ప్రజలు తమ మనుగడ కోసం ఆధిపత్య సంస్కృతికి లొంగిపోవడం తప్ప మరో మార్గం లేకపోయిందని, దీనిని అధిగమించాల్సిన అవసరముందని తెలిపారు. ఆధిపత్య కులాల చేతిలో బలహీన తరగతులకు చెందిన ప్రజలు అనేక అవమానాలకు, నిత్య దోపిడీకి గురవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. శక్తిమంతులు ఏం నిర్ణయం తీసుకుంటారో అది నైతికతగా పరిగణించే దుర్మార్గం కొనసాగు తోందన్నారు. ప్రస్తుతం యువత తమ కులానికి వ్యతిరేకంగా ప్రేమించడం లేదా పెళ్లి చేసుకోవడం కారణంగా కుల దురహంకార హత్యలకు బలైపోతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రసంగంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించని సుప్రీంకోర్టు తీర్పును కూడా ఆయన ప్రస్తావించారు. న్యాయాన్ని సరిదిద్దాం. రాజ్యంగ నైతికత వ్యక్తుల హక్కులపై దృష్టి పెడుతూ...సమాజంలో నైతికతను కాపడుతుందని ఆయన తెలిపారు.