Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిమాచల్ ప్రదేశ్ సిఎం సుఖ్వీందర్ వెల్లడి
- బిజెపిలోకి ఫిరాయింపు లుండవని వ్యాఖ్య
న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగులకు పాత ఫించను విధానం (ఒపిఎస్) విధానాన్ని పునరుద్ధరించడంపై తొలి మంత్రివర్గ సమావేశంలోనే కచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు. మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరుగుతుందని, ఆ తర్వాత జరిగే తొలి కేబినెట్ సమావేశంలోనే ఒపిఎస్కు ఆమోదముద్ర వేస్తామని ఆయన చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్లో అంతర్గత పోరు అంటూ వస్తున్న కథనాలపై ఆయన ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. అలాంటి అంతర్గత పోరు కాంగ్రెస్లో లేదని, అయితే కేవలం ముగ్గరు- నలుగురు మధ్య ముఖ్యమంత్రి పీఠం కోసమే పొరపొచ్చాలు జరిగాయని ఆయన తెలిపారు. అలాగే, ఏదైనా తప్పు జరిగితే 'రాజస్థాన్ తరహా పరిస్థితే' ఏర్పడుతుందని వ్యాఖ్యానిం చారు. రాష్ట్రంలోని ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా బిజెపిలోకి ఫిరాయించ బోరని, ప్రజల కోసం పని చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.