Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి:భారత నౌకాదళాన్ని మరింత పటిష్ట పరిచేలా కొత్తగా వార్ షిప్ ఐఎన్ఎస్ మోర్ముగో ప్రవేశించింది. స్టెల్త్-గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌకను ఆదివారం భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైన్యంలోకి ప్రవేశపెట్టారు. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రితో పాటు సిడిఎస్ అనిల్ చౌమాన్, నేవీ చీఫ్ అడ్మినరల్ ఆర్ హరికుమార్, గోవా గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిళ్లై, గోవా సిఎం ప్రమోద్ సావంత్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. నౌక 163 మీటర్ల పొడవు. 17 మీటర్ల వెడల్పుతో 7400 టన్నుల బరువుతో ఉంది. భారతదేశంలో నిర్మించిన అత్యంత శక్తివంతమైన యుద్దనౌకల్లో మోర్ముగో ఒకటి. నాలుగు శక్తివంతమైన గ్యాస్ టర్బైన్లతో, కంబైన్డ్ గ్యాస్ అండ్ గ్యాస్ కాన్ఫిగరేషన్లో 30 నాట్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. స్వదేశీ నౌకానిర్మాణ చరిత్రలో మోర్ముగో మైలు రాయి అని నేవీ చీఫ్ అభివర్ణించారు. మోర్ముగోను 75 శాతం స్వదేశీ సాంకేతికతతో నిర్మించారు. న్యూక్లియర్, బయోలాజకిల్ -కెమికల్ యుద్ద పరిస్థితుల్లో పోరాడేలా నౌకను నిర్మించారు.