Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు
- కంపెనీ వ్యవసాయాన్ని ప్రతిఘటిద్దాం :
- వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్
న్యూఢిల్లీ : వ్యవసాయాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఆహార భద్రతను నియంత్రించడానికి కార్పొరేట్లకు మోడీ ప్రభుత్వం ద్వారాలు తెరిచిందని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ విమర్శించారు. ఆదివారం కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ ప్రాంతంలో వక్కాలి వరి పంట రక్షణ ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. ఆహార భద్రతను, ఉపాధి హామీని, సమానత్వాన్ని సాధించుకు నేందుకు కష్టజీవులు సంసిద్ధులు కావాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ దేశంలో వరి ధాన్యం సేకరణను పూర్తిగా కేంద్రం వదిలి వేసిందని.. ఫలితంగా ఆహార భద్రతతో పాటు వ్యవసాయ కూలీలకు పని దినాలు కూడా తీవ్రంగా కుదించబడతాయని ఆయన అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేరళ రాష్ట్రంలో రైతు సంఘంతో కలిసి వ్యవసాయ కార్మిక సంఘం వక్కాలి రకం వరి పంటను పరిరక్షించుకునేందుకు ఉద్యమాన్ని ప్రారంభించిం దన్నారు. ఇది దేశవ్యాప్తంగా రైతు కూలీల ఐక్యతకు, ఆహార భద్రత పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. మోడీ అండతో, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతులు కూడా లేకుండా రియల్ ఎస్టేట్లు భూములు మీదికి ఎగబడుతు న్నారని వ్యవసాయ భూమిని అంతా రియల్ ఎస్టేట్ భూములుగా మార్చుతున్నారని, ఇది దేశ ప్రజలకు తీరని నష్టాన్ని కలిగిస్తుంది అని ఆందోళన వ్యక్లం చేశారు. ఒకవైపు సముద్ర తీర ప్రాంతం మరొకవైపు సహజ నీటి వనరులు ఉన్న ప్రాంతంలో ఆరు నెలల పాటు చేపల పెంపకం, మిగిలిన కాలంలో అదే భూమిలో వక్కాలి రకం వరి పంటను కేరళలో సాగు చేస్తారని పంట పండించే క్రమంలో ఎటువంటి పురుగుమందులు వేయరని, పూర్తి ఆర్గానిక్ పంటగా పండుతుందని ఆయన తెలిపారు. సాధారణ వరి బియ్యం కేజీ 60 రూపాయలు ఉండగా వక్కాలి పంట బియ్యం కేజీ 110 ఉంటుందని తెలిపారు. వక్కాలి రకం బియ్యం కేరళలోనే కాక అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు ఉందని ఆయన తెలిపారు. మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతలు, అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా రైతులను బలవంతంగా భూములు నుండి నెట్టేసి ..బలవంతంగా రియల్ ఎస్టేట్లకు కార్పొరేట్లకు అవకాశం కల్పించేటువంటి పద్ధతికి దిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీ సభ్యులు దేవదర్శన్, రాష్ట్ర జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.