Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షిల్లాంగ్లో ప్రధాని మోడీ
షిల్లాంగ్: ఈశాన్య భారతదేశ అభివృద్ధికి అడ్డంకులుగా ఉన్న అవినీతి, పక్ష పాతం, హింస వంటి వాటిని నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రధాని మోడీ అన్నారు. షిల్లాంగ్ లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈశాన్య కౌన్సిల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న మోడీ ప్రసంగించారు. ఫుట్బాల్లో ఎవరైనా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఆడితే వారికి రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపిస్తారని, అదే విధంగా గత ఎనిమిదేండ్లలో ఈశాన్యప్రాంతం అభివృద్ధిని ఆడుకున్న వారికి రెడ్కార్డ్ ఇచ్చామని అన్నారు. ఈ ప్రాంతంలో క్రీడల అభివృద్ధిపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని.. దేశంలోనే మొట్ట మొదటి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం మరియు ఈప్రాంతంలో 90 ప్రధాన క్రీడా ప్రాజెక్టు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. ఖతార్లో ప్రపంచ ఫుట్బాల్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సివుండగా, ఇక్కడ తాను ఫుట్బాల్ అభిమానుల మధ్య ఓ ఫుట్బాల్ మైదానంలో ర్యాలీ నిర్వహించడం యాధృచ్ఛికమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.6వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు.