Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక అసెంబ్లీలో ఆయన చిత్రపటం ఆవిష్కరణ
- ఇది ఏకపక్ష నిర్ణయం : కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన
బెంగళూరు : కర్నాటక అసెంబ్లీలో అధికార బీజేపీ వీడీ సావర్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించింది. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ తీరుపై ప్రతిపక్షనేత సిద్ధరామయ్య సహా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. సావర్కర్ చిత్రపటం ఏర్పాటు నిర్ణయం ఏకపక్షమని అన్నారు. అంతేకాకుండా, అసెంబ్లీలో వాల్మీకి, బసవన్న, కనకదాస, డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్, సర్ధార్ ల్లభారు పటేల్ వంటి మహనీయుల చిత్రపటాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు స్పీకర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. అసెంబ్లీలో ప్రభుత్వ అవినీతిపై చర్చ జరగకుండా ఉండేందుకే బీజేపీ అసెంబ్లీలో వీడీ సావర్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించి వివాదం రేపిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు అన్నారు. అయితే, చిత్రపట ఏర్పాటు నిర్ణయం స్పీకర్దేనని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై చెప్పారు తాను తమ నేతలతో పాటు ప్రతిపక్ష నాయకులతోనూ మాట్లాడతానని అన్నారు. కాగా, సావర్కర్ గొప్ప మహనీయుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అంటూ ఆయనను కీర్తించే విషయం తెలిసిందే.