Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫార్మాస్యూటికల్ కంపెనీకి ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చిన భారత్
న్యూఢిల్లీ : ఆఫ్రికాదేశం గాంబియాలో 69 మంది చిన్నారుల మరణాలకు కారణమైన దగ్గు సిరప్లు తయారు చేసిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థకు భారత్ ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం దీనికి సంబంధించి ఒక షాకింగ్ వార్తను తెలిపింది. హర్యానాలోని ఫార్మస్యూటికల్ సంస్థ తయారు చేసిన నాలుగు దగ్గు సిరప్‌ల శాంపిళ్లను తీసుకున్న జెనీవాలోని ఒక ల్యాబ్.. అందులో డైఇథైలిన్ గ్లైకాల్ (డీఈజీ) ఉనికిని గుర్తించింది. ఈ మేరకు ఒక నివేదికలో పేర్కొన్నది. గాంబియాలోని 69 మంది చిన్నారుల మరణాలతో సంబంధం ఉన్నదా? అని దర్యాప్తు చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 23 శాంపిళ్లను ల్యాబ్‌కు పంపింది.