Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : విమాన సిబ్బంది కూడా మనుషులే అంటూ ఎయిర్‌హోస్టెస్‌కు జెట్ ఎయిర్వేస్ మద్దతు తెలిపింది. ''తాను పనిమనిషిని కాను .. ఉద్యోగిని'' అంటూ ఇండిగో సిబ్బంది ప్రయాణికుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోపై జెట్ ఎయిర్వేస్ గురువారం స్పందించింది. కొందరు ప్రయాణికులు విమాన సిబ్బందిని 'సేవకులు' అన్న పేరుతో వారిని దుర్భాషలాడటం, కొట్టడం చేస్తారని జెట్ ఎయిర్వేస్ సిఇఒ సంజీవ్ కపూర్ పేర్కొన్నారు. అన్నిటికంటే ముఖ్యం... వారు కూడా మనుషులేనని గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఇస్తాంబుల్-ఢిల్లీ విమానంలో ఈ నెల 16న ప్రయాణికుడికి, ఎయిర్ హోస్టెస్‌కు మధ్య జరిగిన వాగ్వివాదానికి సంబంధించిన వీడియో వైరలైన సంగతి తెలిసిందే.
మీవల్ల తమ ఉద్యోగి ఏడుస్తున్నారని, మీ బోర్డింగ్ పాస్‌లో ఏం ఉందో దాని ప్రకారమే తాము ఆహారాన్ని అందిస్తామని ఎయిర్‌హోస్టెస్ ప్రయాణికుడికి చెబుతున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి.
దీంతో ఆ ప్రయాణికుడు నువ్వు ప్రయాణికుడికి సేవకురాలివి అని వ్యాఖ్యానించగా, తాను ఉద్యోగినని, మీకు పనిమనిషిని కాను అంటూ గట్టిగా అరిచారు. ఎందుకు అరుస్తున్నావు? నోర్మూసుకో. అని ప్రయాణికుడు హెచ్చరించగా, ''నువ్వూ నోర్మూసుకో'' అని ఎయిర్‌హోస్టెస్ బదులిచ్చిన దృశ్యాలు ఉన్నాయి.