Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెలగావి : రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పంచమసాలి లింగాయత్ కమ్యూనిటీకి చెందిన లక్షలాది మంది గురువారం ఆందోళన చేపట్టారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకలోని విదాన సౌధ ఎదుట భారీ ప్రదర్శన నిర్వహించారు. బిజెపి ఎమ్మెల్యే బసన గౌడ ఈ ప్రదర్శనకు నేతృత్వం వహిస్తున్నారు
లింగాయత్ వర్గంలోని ఈ ఉప విభాగం, రాష్ట్ర జనాభాలో 18 శాతంగా ఉంటుంది. ఈ సామాజిక వర్గం కర్ణాటకలోని కిత్తూర్ ప్రాంతంలో 100 సీట్లకు పైగా ప్రభావితం చేస్తోంది. కిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం కింద ఉత్తర కన్నడ, బెల్గావి, గడగ్, దర్వాడా, విజరుపుర, బాగల్ కోట్, హవేరి జిల్లాలు ఉన్నాయి. లింగాయత్ కమ్యూనిటీలో 60 శాతంగా ఉన్నప్పటికీ .. తమకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని వాదిస్తున్నారు. వీరశైవ లింగాయత్‌లకు ప్రస్తుతం ఒబిసి కోటాలోని 3బి కేటగిరీ కింద 5 శాతం రిజర్వేషన్లు లభిస్తున్నాయని పేర్కొన్నారు. తమకు 15 శాతం వచ్చేలా 2ఎకింద చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎసిలకు 15 శాతం నుండి 17 శాతానికి, ఎస్టిలకు 3 శాతం నుండి 7 శాతానికి పెంచుతూ కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై మంగళవారం అసెంబ్లీలో బిల్లుని ప్రవేశపెట్టారు.