Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు విజయవాడలో అంత్యక్రియలు
(నవతెలంగాణ-అమరావతి)
'ప్రజాశక్తిమంతుడు' వి ఆర్ బొమ్మారెడ్డి కుమారుడు, ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ బి.సూర్యమోహన్ గురువారం ఉదయం బెంగళూరులో గుండె పోటుతో మరణించారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. ఆయనకు భార్య డాక్టర్ అరుణ కుమారి (గైనకాలజిస్టు), కుమారు లు భాస్కర్, చందు ఉన్నారు. కుమారులిద్దరూ సాఫ్ట్వేర్ రంగం లో స్థిరపడ్డారు. సూర్యమోహన్కు ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నా రు.వారిలో ఒకరు అమెరికాలో ఉండగా, మరొకరు హైదరా బాద్లో ఉన్నారు. సూర్య మోహన్ దంపతులిరువురూ భారతీయ రైల్వేలో సుదీర్ఘకాలంపాటు వైద్యులుగా సేవలం దించారు.. చీఫ్ మెడికల్ డైరెక్టర్గా పనిచేసి రిటైరయిన డాక్టర్ సూర్యమోహన్ విజయవాడలోని సీతారాంపురం లో ఉంటూ ఉచిత వైద్య సేవా శిబిరాల్లో చురుగ్గా పాల్గొనేవారు. బొమ్మారెడ్డి పేరిట ప్రజాశక్తి నెలకొల్పిన ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు ఆయన ఇతోధికంగా ఆర్థిక తోడ్పాటు నందించారు. బొమ్మారెడ్డి శతజయంతి సందర్భంగా జర్నలి స్టుల ఆటల పోటీలు నిర్వహించారు.. సూర్య మోహన్ దంప తులిరువురూ గత మూడేళ్లుగా బెంగళూరులోని తమ కుమారుల వద్ద ఉంటున్నారు. గురువారం ఉదయం ఆయనకు గుండె నొప్పిరావడంతో అక్కడి కక్కడే కుప్పకూలి పోయారు. ఆయన భౌతిక కాయాన్ని విజయ వాడలోని సీతారాంపురం (కస్తూరి భాయి పేట దగ్గర)లో స్వగృహానికి తీసు కొస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్న ట్లు కుటుంబ సభ్యులు ఒక ప్రకట నలో తెలిపారు. డాక్టర్ సూర్య మోహన్ పుట్టింది కృష్ణా జిల్లా తేల ప్రోలు. పాఠశాల, కళాశాల విద్య విజయ వాడలోను, వైద్య విద్య గుంటూరు లోను సాగించారు.
పలువురి సంతాపం
డాక్టర్ సూర్య మోహన్ మృతికి సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, పార్టీ పూర్వ రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సాహితీ స్రవంతి రాష్ట్ర కన్వీనర్ తెలకపల్లి రవి, ప్రజాశక్తి సంపాదకులు బి తులసీదాస్, చీఫ్ జనరల్ మేనేజర్ వై ఆచ్యుతరావు, ప్రజాశక్తి మాజీ సంపాదకులు ఎస్ వినయకుమార్ తదితరులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ సాను భూతి తెలియజేశారు. అభ్యుదయ భావా లు, సేవాదృష్టి కలిగిన డాక్టర్ సూర్యమోహన్, ఆయన భార్య అరుణ కమ్యూనిస్టు నేతల కుటుంబాలకు అమూల్యమైన సేవలందించారని వారు కొనియాడారు.