Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగపూర్ : తమను మాట్లాడనివ్వడం లేదని ఆరోపిస్తూ మహారాష్ట్ర శాసనసభలో రెండు సభల కార్యాకలాపాలను ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) సభ్యలు బహిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విధాన్ భవన్ కాంప్లెక్స్ ప్రాంగణంలో నినాదాలు చేశారు. ఎన్‌సిపి, శివసేన (ఉద్ధవ్‌ఠాక్రే గ్రూపు), కాంగ్రెస్‌లతో ఎంవిఎ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎంవిఎ సభ్యులు శాసనసభను బహిష్కరించడంతో పాటు ఎన్‌సిపి ఎమ్మెల్యే జయంత్ పాటిల్‌పై గురువారం స్పీకర్ నిషేధం విధించడాన్ని కూడా ఖండించారు. విధాన్ భవన్ కాంప్లెక్స్ మెట్లపై అజిత్ పవార్, అదిత్య ఠాక్రే, భాస్కర్ జాధవ్ వంటి నేతలు ఏక్నాథ్ షిండే-బిజెపి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదానాలు చేశారు. 'శాసనసభలో ప్రభుత్వం మమల్ని మాట్లాడ్డానికి అనుమతించడం పోవడానికి నిరసనగా ఉభయసభలను మేం బహిష్కరిస్తున్నాం' అని ఎంవిఎ నేతలు తెలిపారు. మహారాష్ట్ర శాసనసభా శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 30 వరకూ జరగనున్నాయి.