Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రైల్వేలో 3,11,521 గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రైల్వేలోని వివిధ విభాగా ల్లో 2022 డిసెంబర్ 1 నాటికి గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఖాళీలు 3,11,521 ఉన్నాయని తెలిపారు. సివిల్ విభాగంలో 87,654, మెకానికల్ విభాగంలో 64,346, ట్రాఫిక్ ట్రాన్స్పోర్టేషన్ విభాగంలో 62,264, ఎక్ట్రికల్ విభాగంలో 38,096, సిగల్, టెలికమ్యూనికేషన్ విభాగంలో 14,815, అకౌంట్స్ విభాగంలో 12,455 పోస్టులు, సెక్యూరిటీ విభాగంలో 9,068, స్టోర్ విభాగంలో 8,881, మెడికల్ విభాగంలో 5,193, అడ్మినిస్ట్రేషన్లో 4,227, సిబ్బంది విభాగంలో 3,944, ఇతర విభాగంలో 578 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
18 జోన్లలో నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీ
18 రైల్వే జోన్స్లో 3,12,941 నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 డిసెంబర్ 1 నాటికి దేశంలోని 18 రైల్వే జోన్స్లో 3,12,941 నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
రైల్వేలో 2,92,840 పోస్టులు ఖాళీ
రైల్వేలో 2,92,840 పోస్టులు ఖాళీగా ఉన్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్టవ్ తెలిపారు. రాజ్యసభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇందులో గ్రూస్ సీ పోస్టులు 2,90,367 పోస్టులు, గ్రూప్ ఏ, గ్రూప్ బీ పోస్టులు 2,473 ఖాళీగా ఉన్నాయి. గత మూడేండ్లుగా గ్రూప్ డీ పోస్టులు భర్తీ చేయలేదు. గ్రూప్ సీ పోస్టులు 2020లో 2,78,206 ఖాళీలు ఉంటే, 2021 నాటికి ఖాళీలు 2,79,435 పెరిగాయి, 2022కి ఖాళీలు సంఖ్య 2,90,367 పెరిగాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బీ పోస్టులు కూడా 2020లో 2,326 పోస్టులు, 2022లో 2,473 పోస్టులు ఖాళీలు పెరిగాయి.