Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేరళ పాత్రికేయుడు సిద్దిఖ్ కప్పన్‌కు అలహాబాద్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయనపై నమోదైన కేసులో గత రెండేం డ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. కప్పన్పై కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్ర వాద నిరోధక చట్టం, ఉపా..మొదలైన కేసులు నమోదు చేశాయి. అయితే ఈ కేసులన్నింటిలోనూ సుప్రీంకోర్టు గతంలో బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనిప్పుడు జైలు నుంచి విడుదలయ్యేం దుకు మార్గం సుగమమైంది. లక్నో కోర్టు బెయిల్ దరఖాస్తును తిరస్కరించటంతో కప్పన్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ దినేశ్ కుమార్ సింగ్ సింగిల్ జడ్జి ధర్మాసనం ఆయనకు శుక్రవారం బెయిల్ మంజూరుచేసింది.
మనీలాండరింగ్ కేసులో కప్పన్, కె.ఎ.రవూఫ్ షరీఫ్, అతికుర్ రహమాన్, మసూద్ అహ్మద్, మహమ్మద్ ఆలం, అబ్దుల్ రజాక్, అష్రఫ్ ఖాదిర్లపై లక్నో కోర్టు ఇటీవల ఆరోపణలను నమోదు చేసింది. ఈ నిందితులపై ప్రాసిక్యూషన్ కంప్లయింట్‌ను ఎన్ఫోర్స్మేంట్ డైరెక్టరేట్ గతంలో దాఖలు చేసింది. ఈ నింది తులంతా నిషిద్ధ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), దాని అనుబంధ విభాగం క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులని పోలీసులు ఆరోపించారు. కప్పన్‌ను 2020 అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ రాష్ట్రం లోని హత్రాస్‌లో ఓ దళిత యువతి లైంగికదాడికి గురై, హత్య కు గురికావడంతో, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు కప్పన్.. మరికొందరు ఆ గ్రామానికి వెళ్లేం దుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.