Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్గార్ పరిషద్‌కు, హింసకు సంబంధమే లేదు : విచారణా కమిషన్ ముందు సాక్ష్యమిచ్చిన పోలీసు అధికారి
న్యూఢిల్లీ : బీమా కొరెగావ్ కేసులో సీనియర్ పోలీసు అధికారి చెప్పిన సాక్ష్యంతో ఆ కేసు పునాదులు కదిలిపోయాయి. కాషాయ బూటకం బయటపడింది. పైగా పోలీసు అధికారి ఈ వ్యాఖ్యలు చేసింది ఎక్కడో కాదు ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ జె.ఎన్.పటేల్, జస్టిస్ సుమీత్ మాలిక్‌లతో కూడిన ద్వి సభ్య విచారణా కమిషన్ ఎదురుగానే. 2018 జనవరి 1న బీమా కొరెగావ్‌లో చెలరేగిన హింసపై దర్యాప్తు చేయడానికి ఈ విచారణా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. పూనేలో విచారణ జరుపుతున్న కమిషన్ ముందు ఈ నెల 20న హాజరైన రిటైర్డ్ పోలీసు అధికారి గణేష్ మోరే మాట్లాడుతూ, ఎల్గార్ పరిషద్‌కు, బీమా కొరెగావ్‌లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. 2017 డిసెంబరు 31న పూనేలోని శనివార్ వాడాలో జరిగిన ఎల్గార్ పరిషద్ సమావేశం ఫలితంగానే జనవరి 1న అల్లర్లు చెలరేగాయనడానికి తనకెలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని మోరే చెప్పారు. మొదటి ఎఫ్ఐఆర్లో కాకుండా తర్వాత తీసుకువచ్చిన ఎఫ్ఐఆర్లోనే ఎల్గార్ పరిషద్ 'సంబంధం' బయటకు తీసుకువచ్చారు. ఇక ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగానే బీమా కొరెగావ్ కేసులో అరెస్టులు చకా చకా జరిగిపోయాయి. అల్లర్లకు, స మావేశాలకు సంబంధముందనే అభియోగాలతోనే మొత్తంగా 16మంది మేధావులు, కార్యకర్తలు జైల్లో మగ్గారు. వారిలో కొందరు 2018 నుండి యుఎపిఎ కింద జైలు శిక్ష అనుభవించగా, 84ఏళ్ళ ఫాదర్ స్టాన్ స్వామి మాత్రం కస్టడీలోనే మరణించారు. ఈ హింస చెలరేగిన సమయంలో గణేష్ మోరే పూనే జిల్లాలో భాగమైన దాండ్కు సబ్‌డివిజనల్ పోలీసు అధికారిగా వున్నారు. అంటే డిఎస్పి హోదాలో వున్నారు. 2018 జనవరి 1న ఆ ప్రాంత బందోబస్తుకు ఆయన సీనియర్ ఇన్చార్జిగా వున్నారు. ఆ రోజున ఉదయం 8గంటల నుండి 11.15గంటల వరకు డ్యూటీలో వున్నపుడు దాదాపు 1200మంది గుమిగూడి వుండగా, వారిని చెల్లా చెదురు చేసినట్లు ఆయన కమిషన్‌కు తెలిపారు. వారందరూ కాషాయ జెండాలు ధరించి వచ్చిన వారే. ఆ తర్వాత, బీమా కొరెగావ్కు రావాల్సిందిగా ఆయనను అధికారులు పిలిచారు. అక్కడ హింస చెలరేగడంతో బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఆ ప్రాంతంలో సాయంత్రం 4వరకు వున్నారు. ఆ తర్వాత కాలంలో ఆ రోజున జరిగిన హింసాత్మక సంఘటనలపై దర్యాప్తుకు ఆయనను ఇన్చార్జిగా నియమించారు. ఆ రకంగా కమిషన్‌కు మోరే కీలకమైన సాక్షిగా నిలిచారు. గత అనేక మాసాలుగా ఆయనను కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ కూడా చేస్తోంది. 2018 జనవరి 1 దాఖలైన మొదటి ఎఫ్ఐఆర్లో హిందూత్వ నేతలు శంభాజీ భిడే, మిలింద్ ఎక్బోటేలు ఇందుకు బాధ్యులుగా పేర్కొన్నారు.