Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : కర్నాటక మైనింగ్ దిగ్గజం గాలి జనార్దన్‌రెడి బీజేపీకి భారీ షాకిచ్చారు. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసిన 'గాలి'.. 'కల్యాణ రాజ్య ప్రగతి పక్ష' పేరుతో ఆదివారం సొంత పార్టీ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో గంగావతి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ పోటీ చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే పలు కేసులు, వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనార్దన్ రెడ్డి సొంత పార్టీ ప్రకటన కర్నాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.పార్టీ ప్రకటన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. తన జీవితంలో రాజకీయంగా మరో ఎపిసోడ్ ప్రారంభమైందని అన్నారు. కర్నాటక ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకే తాను ఇక్కడ ఉన్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి వెళ్లి పలకరిస్తానని చెప్పారు. రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను విడగొట్టి లబ్ధి పొందాలనుకుంటే ఇక్కడ కుదరదనీ, కర్నాటక ప్రజలు ఎప్పుడూ ఐక్యంగా ఉన్నారనీ, ఉంటారని అన్నారు.