Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: 'పండుగలను ఆనందించండి. కానీ కరోనా జాగ్రత్తలు తీసుకోండి' అంటూ ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచంలో వివిధ దేశాల్లో కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆదివారం జరిగిన ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ పండుగలను ఆస్వాదించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం, భౌతికదూరం వంటి ప్రొటోకాల్స్‌ను పాటించాలని అన్నారు. 'దేశం కొత్త శిఖరాలను తాకుతూ ఉండనివ్వండి, 2023లో మనం కలిసి ఒక తీర్మానం చేయాలి. దానిని నిజం చేయాలి'' అని అన్నారు. జీ-20 ఉత్సాహాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనీ, ఈ ఈవెంట్‌ను ఒక సామూహిక ఉద్యమంగా మార్చాలని పేర్కొన్నారు. యోగా, ఆయుర్వేదం ఇప్పుడు ఆధునిక యుగ పరీక్షలకు గీటురాయిగా నిలుస్తున్నాయని ప్రధాని అన్నారు. భారతదేశం 220 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ డోస్‌లు ఇవ్వడం ద్వారా ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించిందని, గ్లోబల్ ఎకానమీలో ఐదో స్థానంలో నిలిచిందని ప్రధాని అన్నారు. ఎగుమతుల విషయంలోనూ 400 బిలియన్ డాలర్ల విలువచేసే మేజికల్ ఫిగర్‌ను సాధించిందని చెప్పారు. అంతరిక్ష, రక్షణ, డ్రోన్ రంగాల్లో కొత్త పుంతలు తొక్కిందని, క్రీడల్లోనూ విజయాలను సొంతం చేసుకున్నామని అన్నారు. అందరికీ ''మేరీ క్రిస్మస్'' శుభాకాంక్షలు తెలుపుతూ, ఇది యేసుక్రీస్తు జీవితం, బోధనలను గుర్తుచేసుకునే రోజు అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.