Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాకినేని బసవపున్నయ్య జయంతి సభలో కేరళ మంత్రి ఎంబి రాజేష్
విజయవాడ: మోడీ సర్కారు వచ్చాక రాజ్యాంగ ప్రాథమిక లక్షణాలన్నీ దాడికి గురవుతున్నాయని కేరళ రాష్ట్ర స్థానిక స్వపరిపాలన, ఎక్సైజ్ శాఖల మంత్రి ఎంబి.రాజేష్ అన్నారు. సమాఖ్య స్ఫూర్తిని మంటకలుపుతున్నదని విమర్శించారు. మొత్తంగా భారత గణతంత్ర వ్యవస్థపైన, రాజ్యాంగంపైనే నేరుగా దాడి జరుగుతున్నదన్నారు.మాకినేని బసవ పున్నయ్య జయంతి సందర్భంగా విజయవాడలో జరిగిన సెమినార్లో ఆయన ఎంబి రాజేశ్ స్మారకో పన్యాసం చేశారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 'రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడి' అనే అంశంపై ఈ సభ జరిగింది. భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ఎంబి పాత్ర చాలా ప్రధానమైనదని అన్నారు. ఈ దేశ కమ్యూనిస్టు ఉద్యమ ఆద్యుడు, తొలి పొలిట్ బ్యూరో నవరత్నాలు సభ్యుల్లో ఎంబీ ఒకరని గుర్తుచేశారు. ఆయన కమ్యూనిస్టు దీపధ్వజం. ఆయన 108వ జయంతి సందర్భంగా కేరళ ప్రజానీకం తరపున శుభాకాంక్షలు తెలిపారు. మోడీ సర్కారు మనువాద హిందూత్వ, బడా కార్పొరేట్ శక్తులే ప్రభుత్వాన్ని నడుపుతున్నా యని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని సంఫ్‌ు పరివార్ దేశాన్ని హిందూత్వ వైపు లాగుతు న్నాయని విమర్శించారు. రాష్ట్రాలు బలంగా ఉండరాదనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమని తెలిపారు. రాజ్యాంగంలోని అధికరణం ఒకటి ప్రకారం.. భారత దేశం అనేది రాష్ట్రాల ఐక్య సంఘటన అని ఆయన స్పష్టం చేశారు. అంటే రాష్ట్రాలు, కేంద్రం యొక్క ఏజెన్సీలు కావని రాజ్యాంగ రచయిత అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. సమాఖ్య స్ఫూర్తి అనేది పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పడినది కాదన్నారు. 600 పైగా సంస్థానాలు, వేలాది భాషలు, వేలాది సంస్కృతులున్నా అన్నీ ఒక తాటిపై తీసుకొచ్చి దేశాన్ని సమాఖ్య వ్యవస్థ ఐక్యంగా ఉంచుతుందని తెలిపారు. సమాఖ్య వ్యవస్థ మాత్రమే అందరికీ మేలు జరుగుతుందన్నారు. కేంద్రం రాష్ట్రా లపై మూడు రకాలుగా.. రాజకీయంగా, ఆర్థికంగా, గవర్నర్ వ్యవస్థ ద్వారా దాడి చేస్తోందని తెలి పారు. రాజస్థాన్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రా ల్లో గవర్నర్ చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. వాటిని గవర్నర్ కార్యాలయంలోని తొక్కిపెడుతున్నారని విమర్శించారు. కేరళలో గవర్నర్ వ్యవస్థ మరింత దారుణంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి సలహా మేరకే గవర్నర్ నడుచుకోవాలని తెలిపారు. కానీ మంత్రులను కూడా తొలగించాలంటూ ఆదేశాలు ఇస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నార న్నారు. విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ పదవి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినది మాత్రమేనని తెలిపారు. గవర్నర్ కార్యాలయం కేవలం కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కావాలనీ, ఏ విధులు నిర్వహిం చే అధికారం లేదని అంబేద్కర్ రాజ్యాంగ రచనా కాలంలోనే స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. ప్రాంతీ య పార్టీలను బీజేపీ మింగేస్తున్నదని అకాళీదల్, శివసేన పరిస్థితి చూస్తే అర్ధమతుందని తెలిపా రు. బీజేపీతో స్నేహం చేయడం అంటే పులి నోట్లో తల పెట్టడమేనని పేర్కొన్నారు. సహకార శాఖ ఏర్పాటు అమిత్ షా నేతృత్వంలో ఏర్పాటు చేయడం ఉద్దేశ్యం చాలా స్పష్టమైనదని తెలిపారు. సహకార సంస్థల్లో మదుపు చేసిన సొమ్ముపై మోడీ సర్కార్ కన్నేసిందని తెలిపారు. నూతన విద్యా విధానం ఉమ్మడి అంశమని, కానీ ఒకే దేశం.. ఒకే విద్య వల్ల కేంద్రం కనుసన్నల్లో విద్య కుంటు పడుతుందన్నారు. ఈ దాడిని కేరళ, తమిళనాడు తదితర ఏడు రాష్ట్రాలు దీనిని వ్యతిరేకించాయని తెలిపారు.