Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండేండ్లలో ఐదు శాతం పెరిగిన కేసులు
- యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్‌లో అధికం : కేంద్రం
న్యూఢిల్లీ :భారత్‌లో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోని ఆయా రాష్ట్రాలలో ఈ ప్రాణాంతక కేసులు అధికంగా నమో దవుతున్నాయి. ముఖ్యంగా, గత రెండేండ్లలో భారత్ లో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ఐదుశాతం పెరి గాయి. యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలలో ఈ కేసులు అధికంగా నమోదు కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. దీనిపై దేశంలోని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ అవసరమని నొక్కి చెప్పారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ -నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ (ఐసీఎంఆర్- ఎన్సీపీఆర్) అధ్యయనాన్ని ఉటంకిస్తూ పార్లమెంటులో కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. భారత్‌లో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ఐదుశాతం పెరిగా యి. ప్రాణాంతక వ్యాధికి సంబంధించిన మొత్తం ఘటనలు మాత్రం గతేడాది 34 వేల కంటే ఎక్కువగా ఎగబాకాయి. ఇక భారత్‌లో యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్‌లతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని తమిళనాడు, కర్నాటక, ఏపీ లలో ఈ కేసులు అధికంగా నమోదయ్యాయి. 2020 లో దేశంలో నమోదైన మొత్తం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసుల సంఖ్య 98,278 కాగా.. అది 2022 నాటికి 1,03,371కి పెరిగింది. అంటే ఈ పెరుగుదల 5.2 శాతం. ఇక 2022లో స్త్రీ, పురుషులలో మొత్తం క్యాన్సర్ కేసుల సంఖ్య 2,10,958 తో యూపీలో అధికంగా నమోదైంది. ఇదే ఏడాది మహారాష్ట్రలో 1,21,717 కేసులు, పశ్చిమ బెంగాల్లో 1,13,851 కేసులు, బీహార్‌లో 1,09,274 కేసులు రికార్డయ్యా యి. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడులో 93,536 కేసులు, కర్నాటకలో 90,349 కేసులు, ఏపీలో 73,536 కేసులు రికార్డయ్యాయి. 2019 నుంచి ఈ రాష్ట్రాల లో క్యాన్సర్ కేసులలో పెరుగుదల కనిపిస్తు న్నది. ఇక దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే క్యాన్సర్ కేసులు తెలంగాణలో చాలా తక్కువగా నమోద య్యాయి. ఇక్కడ 2019లో నమోదైన క్యాన్సర్ కేసుల సంఖ్య 46,464 కాగా.. 2020 నాటికి అది 47,620గా రికార్డయ్యింది. ఇక దేశంలో లక్షద్వీప్ మినహా కేసుల సంఖ్య తగ్గినట్టు కనిపించిన రాష్ట్రాలేవీ లేకపోవడం గమనార్హం. పొగాకు సంబం ధ ఉత్పత్తులు, మద్యం, శారీరక వ్యాయామం తగినం త లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం, గాలి కాలుష్యం వంటివి ఊపరితిత్తుల క్యాన్సర్‌కు కారణా లుగా కేంద్రం తెలిపింది. ఐసీఎంఆర్ అంచనాల ప్రకారం.. జీవిత కాలంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి క్యాన్సర్ ఉండే అవకాశం ఉన్నది. దీంతో 2020 నుండి 2025 వరకు ఈ వ్యాధి పెరుగుదల 12.8 శాతానికి పెరగొచ్చు. అధిక క్యాన్సర్ కేసులు 40 నుండి 64 ఏండ్ల మధ్య వారిలో నమోదైయ్యా యని ఐసీఎంఆర్ వివరించింది. పురుషులలో లంగ్ క్యాన్సర్ ప్రమాదకరమైనదనీ, మహిళలతో పోల్చుకుంటే ఈ క్యాన్సర్ బారిన పడేది ఎక్కువగా వారేనని వైద్య ఆరోగ్య నిపుణులు తెలిపారు. కాబట్టి తగిన ఆరోగ్య సూచనలు పాటించాలని సూచించారు.