Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు బలోపేతం చేయాలి
- ప్రధాని మోడీతో కేరళ సీఎం పినరయి విజయన్ భేటీ
న్యూఢిల్లీ : సమాఖ్యస్ఫూర్తిగా సహకరించాలనీ,అందుకు కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు బలోపేతం చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. మంగళవారం నాడిక్కడ సౌత్ బ్లాక్‌లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ భేటీ అయ్యారు. కోవిడ్-19 ముప్పు పొంచి ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కోవిడ్-19పై పోరాడేందుకు కేరళ చేస్తున్న సన్నాహాలను కూడా ప్రస్తావించారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు కూడా బలోపేతం చేయాలని, వివిధ కేంద్ర-రాష్ట్ర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు ముమ్మరం చేయాలని కోరారు. కేరళలో జాతీయ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రి ప్రధానికి తెలియజేశారు. జల్ జీవన్ మిషన్, వివిధ జాతీయ రహదారి, ఇతర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంపై చర్చించారు. ఇద్దరూ ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కేరళకు చెందిన కథాకళి శిల్పాన్ని బహుమతిగా ఇచ్చారు. ప్రధాని మోడీతో భేటీలో పినరయి విజయన్‌తో పాటు కేరళ ప్రధాన కార్యదర్శి వి. పి ఆనందం కూడా పాల్గొన్నారు.