Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలోని రాజకీయ, ఆర్థిక పరిస్థితులపైన, అలాగే త్రిపురతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలపై పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చిస్తున్నామని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సమావేశాలు మంగళవారం నాడిక్కడ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఏకేజీ భవన్)లో ప్రారంభమయ్యాయి.. ఈ సమావేశాలో జాతీయ, అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై చర్చిస్తారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం విధానాలపై చర్చించనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో సీపీఐ(ఎం) బలంగా ఉండే త్రిపురలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడి పరిస్థితులతో ఎన్నికల జరిగే రాష్ట్రాల్లో పరిస్థితులను పొలిట్ బ్యూరో చర్చిస్తుందని ఏచూరి తెలిపారు. పొలిట్‌బ్యూరో సమావేశంలో సీతారాం ఏచూరితో పాటు ప్రకాశ్ కరత్, మాణిక్ సర్కార్, బృందా కరత్, పినరయి విజయన్, బివి రాఘవులు, ఎండి సలీం, సూర్యకాంత్ మిశ్రా, రామచంద్ర డోమ్, తపన్ సేన్, నీలోత్పల్ బసు, జి. రామకృష్ణన్, ఎంఎ బేబి, ఎంవి గోవిందన్, అశోక్ దావలే, ఎ.విజయరాఘవన్ తదితరులు పాల్గొన్నారు.