Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయిలో ప్రధాన కార్యాలయం వద్ద ఉద్యోగులు ఆందోళన
ముంబయి : షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ) ప్రయివేటీకరణ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆ సంస్థ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మంగళవారం ముంబాయిలోని ఎస్సీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఆ సంస్థ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ''షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విభజనను ఆపాలి. ప్రయివేటీకరణ ఆలోచనను విరమించుకోవాలి. సేవ్ ఎస్సీఐ, సేవ్ అవర్ జాబ్స్, సేవ్ నేషన్'' అంటూ ప్లకార్డులు చేబూని నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి మనోజ్ యాదవ్ మాట్లాడుతూ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ల్యాండ్ అండ్ అసెట్స్ లిమిటెడ్గా విడదీయాలని ప్రతిపాదనను ఆపాలని డిమాండ్ చేశారు. రూ.1,000 కోట్లు కష్టపడి సంపాదించిన డబ్బును నాన్ కోర్ కంపెనీకి ఎందుకు బదిలీ చేయాలని ప్రశ్నించారు.