Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్: ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. మంగళవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆమెను అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. తల్లి అనారోగ్యం గురించి తెలుసుకున్న ప్రధాని మోడీ హుటాహుటిన అహ్మదాబాద్ చేరుకుని... తల్లిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడారు..
మోడీజీ.. మీకు అండగా ఉంటాం: రాహుల్
హీరాబెన్ ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందించారు. ''తల్లీ కొడుకుల మధ్య ప్రేమ వెలకట్టలేనిది. మోదీజీ.. ఈ సమయంలో నా ప్రేమ, మద్దతు మీకు ఉంటుంది. మీ మాతమూర్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా'' అని రాహుల్ రాసుకొచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూడా స్పందిస్తూ.. హీరాబెన్ త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారు.