Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆరోగ్యకర పోటీ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నందుకు విధించిన జరిమానాను గడువులోపు చెల్లించనందుకు టెక్ దిగ్గజం గూగుల్‌కు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) డిమాండ్ నోటీసులు అందజేసింది. గూగుల్‌కు వ్యతిరేకంగా సీసీఐ అక్టోబర్‌లో రెండు కేసుల్లోనూ మొత్తం రూ.2,274 కోట్ల జరిమానా చెల్లించాలని స్పష్టం చేసిం ది. ఈ మొత్తాన్ని 60 రోజుల్లోగా అంటే డిసెంబర్ 25 కల్లా చెల్లించాల్సి ఉండగా.. గడువు ముగిసింది. దీంతో తాజాగా గూగుల్‌కు డిమాండ్ నోటీసును జారీ చేసింది. సిసిఐ ఆదేశాలను ఎన్సీఎల్టీలో గూగుల్ సవాల్ చేసింది. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. సీసీఐ ఆదేశాలపై అప్పీల్ చేశామని..స్టే రాకపోతే చెల్లించాల్సి వస్తుందని గూగుల్ తెలిపింది.