Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: మోడీ పాత పథకాలకు పేర్లుమార్చి కొత్త పేర్లు పెడుతోంది. మరో వైపు ఏండ్ల తరబడి ఇస్తున్నపతకాలను రద్దుచేస్తోం ది.విశిష్టపురస్కారాలు అందుకుంటామని ఆశించేవారిని బీజేపీ ప్రభుత్వం నిరుత్సాహపరుస్తోంది. తాజాగా ప్రధాన మంత్రి పోలీస్ మెడల్ ఫర్ లైఫ్ సేవింగ్ను కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఎ) రద్దు చేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతకు ముందు పోలీస్, పారా మిలటరీ దళాలకు రెండు సెట్ల పతకాలను కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ నిలిపివేసింది.