Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వచ్చే కొత్త ఏడాదిలో 5జీ వినియోగదారులపై భారం మోపడానికి ప్రయివేటు టెలికం కంపెనీలు కసరత్తును చేస్తున్నట్టు సమాచారం. పెట్టుబడుల అవసరాల పేరుతో ప్రజలను ముక్కుపిండి వసూలు చేయనున్నాయి.
పెరుగుతున్న వ్యయాలకు అనుగుణంగా టారిఫ్ చార్జీలను పెంచే అవకాశం ఉందని టెలికం వర్గాల సమాచారం. ఇప్పటికీ భారీ లాభాల్లోనే ఉన్న టెల్కోలు స్పెక్ట్రమ్ చెల్లింపులు, పెట్టుబడులు, నెట్వర్క్ విస్తరణ పేరుతో చార్జీలను పెంచనున్నాయి. రూ.100 లోపు ఉన్న నెలవారి ఛార్జీలను 4జీ తెచ్చిన కొత్తలో ఉచిత కాల్స్ పేరుతో మార్కెట్లోకి వచ్చి రూ.120 ఛార్జ్ చేయగా.. ఇప్పుడు దాదాపు రూ.300 చేరువకు చేర్చిన విషయం తెలిసిందే.