Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో బిజెపి నేతల తీరుతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హౌరా రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో శుక్రవారం ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన ఆయన తల్లి మరణంతో వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హౌరాలో నిర్వహించిన కార్యాక్రమ వేదికపై కేంద్ర రైల్వే మంత్రులు అశ్విని వైష్టవ్‌తో పాటు పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలు పాల్గొన్నారు. గవర్నరు కూడా వేదికపై సివి ఆనంద్ కూడా ఆసీనులయ్యారు. అయితే ముఖ్యమంత్రి మమత బెనర్జీ వేదిక ఎక్కుతుండా బిజెపి నేతలు, కార్యకర్తలు 'జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేశారు. ప్రజలందరికీ సంబంధించిన కార్యక్రమంలో మతతత్వ నినాదాలు ఏంటంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. వేదిక ఎక్కకుండా ప్రేక్షకులు కూర్చున్న చోటే కూర్చుండిపోయారు. ఆమెను బుజ్జగించడానికి అశ్విని వైష్ణవ్, గవర్నర్ సి.వి.ఆనంద్ బోస్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మొత్తంగా ఆ కార్యక్రమం నుండి వెళ్ళిపోవాలని కూడా తొలుత మమత భావించారు. 'జై శ్రీరామ్' నినాదాలపై గవర్నర్‌కి కూడా ఫిర్యాదు చేశారు. గతేడాది కూడా సుభాష్ చంద్ర బోస్ 125వ జయంతి సందర్భంగా కోల్‌కతాలో జరిగిన సభలో ఇదే నినాదాలతో ఆమె ఆ కార్యక్రమంలో మాట్లాడేందుకు తిరస్కరించారు. మమతను అవమానించేందుకే బిజెపి మద్దతుదారులు పదేపదే ఇలా చేస్తున్నారంటూ తృణమూల్ నేతలు పేర్కొన్నారు. హౌరా నుండి కొత్త జల్పారుగురిని కలిపే తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను శుక్రవారం ప్రధాని మోడీ వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు.
మోడీ వర్చువల్‌గా రైలును ప్రారంభించగానే మమత కాస్త కుదుటపడ్డారు. 'వ్యక్తిగత జీవితంలో సంభవించిన ఈ విషాదం సమయంలో మీకు బలం చేకూరాల'ని కోరుకుంటున్నట్లు అని మోడీని ఉద్దేశించి మమత పేర్కొన్నారు.