Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శిక్షణ పొందిన పోలీసు అధికారులను నియమించాలి
- మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ కేసుల దర్యాప్తుపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ : మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ కేసుల దర్యాప్తు సులభతరం చేసేందుకు మూడు నెలల్లోగా అన్ని పోలీస్టుస్టేషన్లలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, శిక్షణ పొందిన పోలీసు అధికారులను నియమించాలని అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. 2018 సెప్టెంబర్ 9న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తుది ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎంవీ సవరణ చట్టం, దాని కింద రూపొందించిన నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి, మోటరు ప్రమాద క్లెయిమ్ కేసులను పరిష్కరించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని హౌం శాఖ అధిపతి, డీజీపీలు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ, లేకపోతే పట్టణ స్థాయిల్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, శిక్షణ పొందిన పోలీసు సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. 'బహిరంగ ప్రదేశంలో మోటారు వాహనం రోడ్డు ప్రమాదం గురించి సమాచారం అందుకున్నప్పుడు, సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) మోటారు వాహన సవరణ చట్టంలోని సెక్షన్ 159 ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత, మోటారు వాహనాల సవరణ నిబంధనల ప్రకారం దర్యాప్తు అధికారి మొదటి ప్రమాద నివేదికను 48 గంటల్లోగా క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌కు సమర్పించాలి. మధ్యంతర ప్రమాద నివేదిక, వివరణాత్మక ప్రమాద నివేదిక కూడా నిర్ణీత గడువులోపు పోలీసులు మూడు నెలల్లోగా క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌కు దాఖలు చేయాలి' అని తెలిపింది.