Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ తల్లి మృతి.. ముగిసిన అంత్యక్రియలు
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మోడీ (100) తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆమెను అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా హాస్పిటల్లో చికిత్సపొందతూ కన్నుమూశారు. ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో తల్లి మృతి వార్తను తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో ఆమె 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. జూన్ 18, 1923లో జన్మించిన హీరాబెన్ గాంధీనగర్‌కు సమీపంలోని రాయసన్ గ్రామంలో ప్రధాని మోడీ సోదరుడు పంకజ్ మోడీ వద్ద ఉంటున్నారు. మాతృమూర్తి పాడెను ప్రధాని మోశారు. అంతిమయాత్ర వాహనంలోనూ తల్లి మృతదేహం వద్దే కూర్చొని భావోద్వేగానికి గురయ్యారు. గాంధీనగర్‌లోని శ్మశాన వాటికలో హీరాబెన్ అంత్యక్రియలు పూర్తిచేశారు. ప్రధాని మోడీ తన సోదరులతో కలిసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హీరాబెన్ మృతి వార్త తెలుసుకుని ప్రధాని మోడీకీ సీఎం కేసీఆర్ సహ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.