Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి అపరిమిత అధికారాలు : హక్కుల కార్యకర్తలు
- చిన్న పిల్లల సమాచారమూ సేకరించొచ్చు..
- నిఘా కార్యకలాపాలపై ప్రభుత్వ శక్తిని పెంచే బిల్లు ఇది : హ్యూమన్ రైట్స్ వాచ్
న్యూఢిల్లీ : పాత చట్టాల్ని మారుస్తూ, కొత్త చట్టాలు చేస్తూ..పౌరుల ప్రాథమిక హక్కులకు మోడీ సర్కార్ తూట్లు పొడుస్తోంది. మొన్న సాగు చట్టాలు, నిన్న లేబర్ కోడ్స్, ఇప్పుడు 'పౌరుల వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు'. దేశ పౌరుల వ్యక్తిగత సమాచారానికి రక్షణ కల్పించే ఉద్దేశమని పైకి చెబుతున్నా, బిల్లు అసలు లక్ష్యం..ప్రభుత్వ నిఘా శక్తిని అపరిమితం చేయటమే. కేంద్రం తాజాగా తెరపైకి తీసుకొచ్చిన ముసాయిదా బిల్లు 'డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2022'పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హక్కుల కార్యకర్తలు ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వానికి దఖలుపడుతున్న నియంత్రణలు, ప్రత్యేక మినహాయిం పులపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి కల్పించిన ప్రత్యేక వెసులుబాట్లతో పౌరుల వ్యక్తిగత సమాచారానికి ముప్పు వాటిల్లడమేగాక, పౌరులపై నిరంతరం నిఘాకు ఆస్కారం ఏర్పడుతుందని హ్యూమన్ రైట్స్ వాచ్, గ్లోబల్ రైట్స్ బాడీ ఆరోపించాయి. ప్రతిపాదిత బిల్లు ఎట్టి పరిస్థితుల్లో చట్టరూపం దాల్చరాదని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ''ఇది పౌరుల వ్యక్తిగత డేటాకు భద్రత కల్పించటం కాకుండా, ప్రభుత్వానికి అపరిమిత అధికారాల్ని కట్టబెట్టింది. ప్రభుత్వ నిఘాను ప్రశ్నించడానికి వీల్లేకుండా బిల్లును రూపొందించారు'' అని తన వెబ్సైట్లో హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొంది. 'గ్లోబల్ రైట్స్ బాడీ' కూడా బిల్లులోని అంశాలపై ఆందోళన వ్యక్తం చేసింది. పౌర హక్కుల సంఘాలను లక్ష్యంగా చేసుకొని బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపిం చింది. డాటా ప్రొటెక్షన్ నిపుణులు, పౌర సంఘాల కార్య కర్తలు బిల్లుపై పెదవి విరుస్తున్నారు. ''పౌరులపై నిఘా చేపట్టడానికి ప్రభుత్వ శక్తిని పెంచేదిగా ఉంది. పౌరుల గోప్యత, భద్రత, ప్రాథమిక హక్కులను బలహీన పరుస్తోంది. డిజిటల్ వేదికల్లోనూ పౌరుల గోప్యత, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి'' అని హ్యూమన్ రైట్స్ వాచ్ దక్షిణాసియా డైరెక్టర్ మీనాక్షి గంగూలీ అన్నారు.
ప్రభుత్వానికి అనేక మినహాయింపులు
ఈ ఏడాది ఆగస్టులో రద్దు చేసిన డేటా భద్రత బిల్లు స్థానంలో కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. దీనిపై సలహాలు, సూచనలను పంపేందుకు 2023 జనవరి 2 వరకు అవకాశం కల్పించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ బిల్లులోని నిబంధనల నుంచి ప్రభుత్వానికి మినహాయింపులున్నాయి. చట్టపరమైన కార్యకలాపాల కోసం ఈ మినహాయింపుల్ని ఉపయోగించుకునే వెసులుబాట్లు కల్పించారు. బిల్లు ప్రకారం, ప్రత్యేక సందర్భాల్లో సమాచారాన్ని సేకరించడానికి గల కారణాన్ని ప్రభుత్వం వ్యక్తులకు తెలియజేయాల్సిన అవసరం లేదు. అలాగే పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అవసరాన్ని బట్టి సేకరించొచ్చు. శాంతిభద్రతల అంచనా కోసం సమాచారాన్ని ఉప యోగించుకోవచ్చు. డేటా ఆడిటర్ను నియమించడం లోనూ ప్రభుత్వానికి ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయి. ఒకవేళ ఏవరైనా సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వాన్ని కోరినా..ఆ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని బిల్లులో ప్రతిపాదించారు.
స్వతంత్ర లేని ప్రొటక్షన్ బోర్డు
బిల్లులో ప్రతిపాదించినట్టుగా, డేటా ప్రొటక్షన్ బోర్డును ఏర్పాటుచేస్తామని కేంద్రం చెబుతోంది. అయితే ఈ బోర్డులోని సభ్యులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నియ మితు లవుతారు. అలాగే తీసేస్తారు. బోర్డు పనితీరు స్వతంత్రంగా ఉండాలని లేదు. పర్యవేక్షణకు పాలకులు అనుమతించరు. దీనివల్ల ప్రభుత్వ నిఘా మరింత సులభతరం అవుతుం దని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆరోపించింది. జర్నిలిస్టులు, హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష నాయ కులను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వ నిఘాకు అడ్డుఅదుపు ఉండదన్నది బిల్లు ద్వారా అర ్థమవుతోంది. పౌరుల వ్యకి ్తగత డాటాను సేకరించే ప్రభుత్వసంస్థలను బిల్లు రక్షిస్తోందని హక్కుల కార్య కర్తలు విమర్శిస్తున్నారు.