Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా అఖిల భారత మహాసభ నినాదం
- జనవరి 6 నుండి 9 వరకు తిరువనంతపురంలో నిర్వహణ
- 850 మందికి పైగా ప్రతినిధులు
తిరువనంతపురం : 'సమానత్వం కోసం సమైక్యతతో పోరాటం' నినాదంతో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 13వ మహాసభ నిర్వహించనున్నట్టు ఐద్వా జాతీయ ఉపాధ్యక్షులు, మహాసభ ఆహ్వాన కమిటీ చైర్మెన్ పికె శ్రీమతి తెలిపారు. కేరళలోని తిరువనంతపురంలో ఈ నెల 6 నుంచి 9 వరకు ఐద్వా మహాసభ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐద్వా కేంద్ర కమిటీ సభ్యులు, ఆహ్వాన కమిటీ కన్వీనర్ టిఎన్ సీమ, రాష్ట్ర కార్యదర్శి, జనరల్ కన్వీనర్ సిఎన్ సుజాతతో కలిసి పికె శ్రీమతి మాట్లాడారు. ఈ మహాసభకు దేశం నలుమూలల నుంచి దాదాపు 850 మంది పైగా ప్రతినిధులు హాజరుకానున్నట్టు ఆమె తెలిపారు. తిరువనంతపురం ఐద్వా మహాసభకు ఆతిథ్యమివ్వడం ఇది రెండోసారి అని, 36 ఏళ్ళ క్రితం 1986లో మొదటిసారిగా జాతీయ మహాసభ ఇక్కడ జరిగిందని తెలిపారు. 1981లో ఐద్వా ఏర్పడిన సంగతి విదితమే. ''సమానత్వం కోసం సమైకత్యతతో పోరాటం'' అనుది ఈ జాతీయ మహాసభ ప్రధానాంశంగా ఉండనున్నట్లు పికె శ్రీమతి పేర్కొన్నారు. బాల్య నృత్య కళాకారిణి, కేరళ కళా మండలం ఛాన్సలర్ మల్లికా సారాభారు జనవరి 6న ఠాగూర్ థియేటర్లో జరిగే ప్రతినిధుల సమావేశాన్ని ప్రారంభిస్తారని, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బందాకరత్ కీలకోపన్యాసం చేస్తారని తెలిపారు. క్యూబా విప్లవ నేత చె గువెరా కుమార్తె అలెదాగువెరా, ఆమె కుమార్తె ఎస్తెఫానియా మచిన్ గువెరా కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గంటారని పేర్కొన్నారు. 'ప్రభుత్వ ప్రాయోజిత తీవ్రవాదం, నేటి భారతదేశం' అనే అంశంపై సెమినార్‌ను సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అదే రోజు సాయంత్రం 4 గంటలకు గాంధీ పార్క్‌లో ప్రారంభిస్తారని తెలిపారు. మహాసభ చివరి రోజైన 9న సాయంత్రం 4గంటలకు పుత్తరికండం మైదానంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గంటారని తెలిపారు. గత నాలుగు దశాబ్దాల కాలంలో 98 లక్షల సభ్యత్వంతో ఐద్వా దేశంలోనే ప్రముఖ మహిళా సంస్థగా ఆవిర్భవించింది. మహిళా పోరాటాలు, వారి సమస్యలను ప్రముఖంగా పేర్కొంటూ వాటి పరిష్కారం కోసం పోరు సల్పడంలో, మహిళల అభ్యున్నతికి వివిధ చట్టాలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది.సభ్యులు బందాకరత్ కీలకోపన్యాసం చేస్తారని తెలిపారు. క్యూబా విప్లవ నేత చె గువెరా కుమార్తె అలెదాగువెరా, ఆమె కుమార్తె ఎస్తెఫానియా మచిన్ గువెరా కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గంటారని పేర్కొన్నారు. 'ప్రభుత్వ ప్రాయోజిత తీవ్రవాదం, నేటి భారతదేశం' అనే అంశంపై సెమినార్‌ను సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అదే రోజు సాయంత్రం 4 గంటలకు గాంధీ పార్క్‌లో ప్రారంభిస్తారని తెలిపారు. మహాసభ చివరి రోజైన 9న సాయంత్రం 4గంటలకు పుత్తరికండం మైదానంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గంటారని తెలిపారు. గత నాలుగు దశాబ్దాల కాలంలో 98 లక్షల సభ్యత్వంతో ఐద్వా దేశంలోనే ప్రముఖ మహిళా సంస్థగా ఆవిర్భవించింది. మహిళా పోరాటాలు, వారి సమస్యలను ప్రముఖంగా పేర్కొంటూ వాటి పరిష్కారం కోసం పోరు సల్పడంలో, మహిళల అభ్యున్నతికి వివిధ చట్టాలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది.