Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదిలో 19.67 శాతం పెరుగుదల
- 2021లో 61 కేసులు, 2022లో 73 కేసులు నమోదు
- 368 మందిపై 59 చార్జిషీట్లు
న్యూఢిల్లీ : నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఎన్నడూ లేనంతగా ఏడాదిలోనే పెరిగాయి. ఏడాదిలో 19.67 శాతం ఎన్ఐఏ కేసులు పెరిగాయి. 2021లో 61 కేసులను ఎన్ఐఏ నమోదు చేయగా, 2022లో ఎన్ఐఏ కేసుల నమోదు 73కు పెరిగింది. ఇది 19.67 శాతం పెరుగుదలతో ఎన్ఐఏకి ఇది ఆల్ టైట్ రికార్డుగా ఉంది. ఈ కేసుల్లో జమ్మూకాశ్మీర్, అసోం, బీహార్, ఢిల్లీ, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో 35 జిహాదీ టెర్రర్ కేసులు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో 11 కేసులు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 10 కేసులు, ఈశాన్య రాష్ట్రాల్లో ఐదు కేసులు, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) సంబంధిత కేసులు ఏడు, పంజాబ్లో ఐదు కేసులు, గ్యాంగ్స్టర్, టెర్రర్, డ్రగ్ స్మగ్లర్ సంబంధిత మూడు కేసులు, తీవ్రవాద నిధుల కేసు ఒకటి, నకిలీ భారతీయ కరెన్సీ నోటు (ఎఫ్ఐసిఎన్) సంబంధిత కేసులు రెండు నమోదు అయ్యాయి.
ఎన్ఐఎ 2022లో 368 మందిపై 59 చార్జిషీట్లు దాఖలు చేసింది. పరారీలో ఉన్న19 మందితో పాటు 456 మంది నిందితులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. బహిష్కరణపై ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అప్పగించిన తరువాత ఒక నిందితుడిని అరెస్టు చేశారు. 2022లో 38 ఎన్ఐఎ కేసుల్లో తీర్పులు వెలువడ్డాయి. అవన్నీ నేరారోపణతో ముగిశాయి. 109 మందిని దోషులుగా నిర్ధారించిన కోర్టు కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించింది. 2022లో ఆరు జీవిత ఖైదులు కూడా విధించబడ్డాయి. మొత్తం నేరారోపణ రేటు 94.39 శాతంగా ఉంది. ఇది కాకుండా, 2022లో యుఎపిఎ కింద ఎనిమిది మంది వ్యక్తులను వ్యక్తిగత ఉగ్రవాదులుగా గుర్తించారు.