Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాణిజ్య సిలిండర్‌పై రూ. 25 పెంపు
న్యూఢిల్లీ : కొత్త ఏడాదిలో జనాల జేబులకు చిల్లులు పెట్టే చర్యను మోడీ సర్కారు మొదలు పెట్టింది. తాజాగా గ్యాస్ ధరల పెంపునకు దిగింది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 25 పెంచింది. గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరలలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.
అయితే, ఈ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు గృహిణులపై భారం మోపనప్పటికీ.. రానున్న రోజుల్లో హోటళ్లు, రెస్టారెంట్లలో ధరల పెరుగుదలకు కారణం కానున్నాయి.
అలాగే, చిరువ్యాపారులపై ఈ పెరిగిన ధరలు భారం మోపనున్నాయి. ఇది పరోక్షంగా వినియోగదారులు, సామాన్యుల పైనే ప్రభావం చూపుతుందని దేశ ప్రజలు మోడీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధానిలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1769కి చేరింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో చూస్తే.. చెన్నైలో రూ. 1917, ముంబయిలో రూ. 1721, కోల్‌కతాలో రూ. 1870కి ధరలు ఎగబాకాయి. ఇక హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1798.5కి పెరిగింది. గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరలు చివరకు ఆరు నెలల క్రితం, అంటే గతేడాది జులై 6న పెరిగాయి.