Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీరిలో 56 మంది విదేశీయులు
- గతేడాది గణాంకాలు వెల్లడించిన జమ్మూకాశ్మీర్ పోలీసులు
శ్రీనగర్ : గతేడాది జమ్మూకాశ్మీర్‌లో మొత్తం 186 మంది ఉగ్రవాదులు చనిపోయారు. వీరిలో 56 మంది విదేశీయులు ఉన్నారు. లోయలో మొత్తం 93 ఎన్కౌంటర్లో జరిగాయి. జమ్మూకాశ్మీర్ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రాంతంలో 37 శాతం మిలిటెంట్ రిక్రూట్మెంట్ తగ్గిపోయిందని కాశ్మీర్ జోన్ పోలీస్ ఒక ట్వీట్లో పేర్కొన్నది. అలాగే, మిలిటెంట్లు, వారి సహాయకుల నుంచి 360 ఆయుధాలను స్వాధీనపర్చుకున్నట్టు వివరించింది. ఇక అంతకముందు ఏడాదులతో పోలిస్తే.. కిందటేడాది భద్రతా దళాలలకు సంబంధించిన మరణాలు తక్కువగా నమోదయ్యాయని జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్బాఫ్ు సింగ్ జమ్మూలో నిర్వహించిన పత్రికా ప్రకటనలో తెలిపారు. 2022లో 14 మంది పోలీసులు, భద్రతా దళాల సిబ్బందికి చెందిన 17 మంది చనిపోయారని వివరించారు. చనిపోయిన ఉగ్రవాదుల్లో అధికంగా 108 మంది లష్కర్-ఎ-తోయిబా, దాని సంబంధిత ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందినవారని కాశ్మీర్ అదనపు డీజీపీ (ఏడీజీపీ) విజరు కుమార్ చెప్పారు. ఆ తర్వాతి స్థానాల్లో జైష్-ఎ-మహమ్మద్ (35), హిజ్బుల్ ముజాహిదీన్ (22) సంస్థలు ఉన్నాయి. 2022లో ఉగ్రవాదులో చేతిలో 29 మంది పౌరులు మృతి చెందారని ఏడీజీపీ చెప్పారు.