Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది కంటే 15 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ : జీఎస్టీ వసూళ్లు 15శాతం పెరిగినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. నవంబర్లో రూ.1,49,507 కోట్ల జీఎస్టీ వసూలు అయినట్టు ఆదివారం కేంద్ర ఆర్ధిక శాఖ ప్రకటించింది. ఈ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.26,711 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.33,357 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.78,434 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన మొత్తం రూ.40,263 కోట్లతో కలిపి), సెస్ రూ.11,005 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.851 కోట్లతో కలిపి) ఉందని తెలిపింది. డిసెంబర్ నెల వసూళ్లు గత ఏడాది ఇదే నెలలో సాధించిన వసూళ్ల కంటే 15 శాతం అధికంగా ఉందని వివరించింది. డిసెంబర్ వసూళ్లలో వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం 8 శాతం ఎక్కువ ఉండగా, దేశీయ లావాదేవీల (సేవల దిగుమతితో సహా) వల్ల వచ్చే ఆదాయాలు 18 శాతం ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
తెలంగాణలో 11 శాతం, ఏపీలో 16 శాతం పెరుగుదల
ఆంధ్రప్రదేశ్లో గతేడాది డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లు రూ.2,532 కోట్లు ఉండగా, అది ఈ ఏడాది 26 శాతం మేర పెరిగి రూ.3,182 కోట్లకు చేరిందని తెలిపింది. ఇక తెలంగాణలో గత ఏడాది రూ.3,760 కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు 11 శాతం మేర పెరిగి, రూ.4,178 కోట్లుగా ఉందని వెల్లడించింది.