Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంధ విశ్వాసాలను రూపుమాపేందుకు యువకులు వినూత్నంగా
పంజాబ్ : 2023 నూతన సంవత్సర వేడుకలను ప్రపంచమంతా శోభాయమానంగా ఎవరికి నచ్చిన రీతిలో అలా చేసుకుంటూ ఆనందిస్తే... ఇడియట్ క్లబ్ ఆధ్వర్యంలో యువత మాత్రం వినూత్నంగా నూతన సంవత్సర వేడుకలను చేసుకుంది. ఇంతకీ కొత్త సంవత్సర వేడుకలు ఎక్కడనుకున్నారు? శ్మశానంలో.. అవును మీరు చదివింది నిజమే.. శ్మశానంలోనే..! అంతేకాదండోరు... వికృత రూపాలతో ఉన్న దెయ్యాల ముసుగులతో మాస్క్‌లను ముఖానికి ధరించి శ్మశానంలోని ఓ ఊడలమర్రికి వేలాడారు. సమాధుల చుట్టూ తిరుగుతూ... పాటలు పాడుతూ, నత్యాలు చేస్తూ కేరింతలు కొట్టారు. తర్వాత ఓ సమాధి వద్ద కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఎందుకిలా చేశారు? అనుకుంటున్నారా? యువత చేసిన ఈ చర్య వెనుక గొప్ప ఆలోచన ఉంది. అందుకే పంజాబ్‌లోని అమత్‌సర్‌లో కొందరు యువకులు కొత్త ఏడాదికి వినూత్నంగా స్వాగతం పలికారు. సదరు యువత మాట్లాడుతూ ... సమాజాన్ని పట్టిపీడిస్తున్న అంధ విశ్వాసాలను రూపుమాపేందుకు 25 ఏండ్ల క్రితం ఇదే శ్మశానంలో ఇడియట్ క్లబ్ ఏర్పాటైనట్టు చెప్పారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న నిజమైన పిశాచాలు అంధవిశ్వాసాలు, తీవ్రవాదం, డ్రగ్స్, అవినీతి, లంచం అని, వాటిని ప్రతిబింబించేలా ఈ మాస్క్‌లు ధరించినట్టు వివరించారు.