Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 2022 ఏడాది చివరిరోజైన డిసెంబర్ 31 ఒక్కరోజే 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లను డెవవరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. శనివారం రాత్రి 7.20 గంటల సమయానికి దేశవ్యాప్తంగా 1.65 లక్షల బిర్యానీ ఆర్డర్లను డెలివరీ చేయగా, రాత్రి 10.25 గంటల సమయానికి 61వేల పిజ్జాలను పంపినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అలాగే రాత్రి 9 .18 సమ యానికి సుమారు 12,334 కిచిడీ ఆర్డర్లు వచ్చాయని వెల్లడించారు. హైదరాబాదీ బిర్యానీకి 75.4 శాతం ఆర్డర్లు వచ్చాయని, లక్నో 14.2 శాతం మరియు కోల్‌కతాలో 10.4 శాతం ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ పేర్కొంది. వీటిలో బిర్యానీ 3.50 లక్షల ఆర్డర్లతో అగ్రస్థానంలో ఉన్నట్టు వెల్లడించింది. అత్యధి కంగా డెలివరీ చేసిన ఆహార పదార్థాల్లో బిర్యానీయే టాప్‌లో ఉందని తెలి పింది. హైదరాబాద్‌లో బిర్యానీకి అత్యంత ప్రాచుర్యం పొందిన 'బావర్చి' రెస్టారెంట్ శనివారం రోజు నిమిషానికి రెండు బిర్యానీలు డెలివరీ చేయడం గమ నార్హం. డిమాండ్‌ను అందుకునేందుకు ఈ రెస్టారెంట్ 15 టన్నుల బిర్యానీని సిద్ధం చేసినట్టు స్విగ్గీ తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా డోమినోస్ ఇండియా కు చెందిన 61,287 పిజ్జాలను శనివారం డెలివరీ చేసినట్టు తెలిపింది.