Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన పురపాలక ఎన్నికల్లో బీహార్లోని గయ మున్సిపాలిటీ ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. డిప్యూటీ మేయర్ పదవికి పారిశుద్ధ్య కార్మికురాలిని ఎన్నుకున్నారు. గయ పట్టణంలో చింతాదేవి పారిశుద్ధ్య కార్మికురాలిగా గత 40ఏండ్లుగా పనిచేస్తున్నారు. ఎన్నికల్లో తన సమీప అభ్యర్థిపై 16వేల పైచీలకు ఓట్లతో విజయం సాధించారు. గయ ప్రజలు 1996లో కూడా అణగారిన వర్గాలకు చెందిన ఒక రాళ్లు కొట్టుకుని జీవించే భగవతీ దేవి అనే సాధారణ మహిళను లోక్సభకు పంపారు. చింతాదేవి గెలుపుపై గయ పట్టణంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలోనూ ఈ వార్త వైరల్గా మారింది. బీహార్లో ఈసారి జరిగిన పురపాలక ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు చరిత్ర సృష్టించారు. 16 మేయర్ స్థానాల్లో, 11 డిప్యూటీ మేయర్ స్థానాల్లో గెలుపొందారు. పురపాలక ఎన్నికల్లో ఇంతకు ముందు ఓటర్లు కేవలం వార్డ్ కౌన్సిలర్లను మాత్రమే ఎన్నుకునేవారు. మొదటిసారిగా ఓటర్లు తమ ఓటుతో నేరుగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు అభ్యర్థుల్ని ఎంపికచేశారు.