Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుతం 6 ఖాళీలు..
- కొలీజియం సిఫారసుల్ని పెండింగ్లో పెట్టిన కేంద్రం
- పెద్ద నోట్ల రద్దుపై నేడు సుప్రీంతీర్పు
న్యూఢిల్లీ : ఈ ఏడాది మరో 9మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రిటైర్ కాబోతున్నారు. ఇప్పటికే ఆరుగురు జడ్జీలు రిటైర్ కాగా, ఈ స్థానాలు ఇంకా భర్తీ కాలేదు. దీంతో కేసుల విచారణ విషయంలో సుప్రీంకోర్టుపై తీవ్ర ఒత్తిడి పెరగనున్నది. దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థల్లో ఖాళీల సంఖ్య పెద్దఎత్తున ఉండటంతో, కేసుల విచారణ నత్తనడకన సాగుతోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు, సబార్డినేట్ కోర్టుల్లో జడ్జీల ఖాళీలు లక్షల సంఖ్యలో పేరుకుపోయాయి. దీంతో మొత్తంగా న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు భారీగా పెరిగిపోయాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులలో జడ్జీలను కొలీజియం ఎంపిక చేస్తోంది. కింది స్థాయి కోర్టుల్లో న్యాయమూర్తులు, సిబ్బంది ఎంపిక అంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోని అంశం. కొలీజియంకు వ్యతిరేకంగా మోడీ సర్కార్ గళాన్ని వినిపిస్తోంది. 34 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన సుప్రీంకోర్టులో ప్రస్తుతం 28 మంది ఉన్నారు. ఖాళీల భర్తీపై భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ తరుచూ ప్రస్తావిస్తున్నారు. కార్యనిర్వాహక అధికారాలతో న్యాయమూర్తుల ఎంపిక అనేది సరైన విధానం కాదని ఆయన పలు ప్రసంగాల్లో వ్యక్తం చేశారు. చివరి కొలీజియం సమావేశం తర్వాత ఐదుగురు పేర్లను సిఫారసు చేయగా, దీనిపై కేంద్ర న్యాయ శాఖ ఎటూ తేల్చలేదు. ఈ ఏడాది ఏర్పడే ఖాళీల విషయానికొస్తే, జనవరి 4న జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, మే నెలలో జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎం.ఆర్.షా, జూన్లో జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ అజరు రస్తోగి, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జులైలో జస్టిస్ కృష్ణమురారి, అక్టోబర్లో జస్టిస్ ఎస్.రవీంద్రభట్, డిసెంబర్లో జస్టిస్ సంజరు కిషన్ కౌల్ రిటైర్ కాబోతున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య 34. ఇందులో ఇప్పటికే ఆరు ఖాళీలు ఏర్పడగా, ఈ సంఖ్య 2023లో 15కు చేరు కునే అవకాశముంది. కొలీజియం ద్వారా ఎంపిక వుతున్న జడ్జీల జాబితాకు ఆమోదముద్ర వేయ కుండా మోడీ సర్కార్ పెండింగ్లో ఉంచుతోంది. న్యాయవ్యవస్థపై రాజకీయంగా పైచేయి సాధించేం దుకు కేంద్రంలోని పాలకులు ప్రయత్నిస్తున్నారు. సుప్రీంకోర్టు స్వతంత్రను దెబ్బతీసేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాల నాయకులు, న్యాయ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దనోట్ల రద్దుపై ఏం చెప్పనుంది?
పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనున్నది. ఆనాడు మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ ఎస్.ఎ.నజీర్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరిపింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధిం చిన రికార్డులను తమకు సమర్పించాలని గత డిసెంబర్ 8న కేంద్రం, ఆర్బీఐని అత్యున్నత న్యాయ స్థానం ఆదేశించింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. శీతాకాల సెలవుల అనంతరం సుప్రీంకోర్టు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నది.