Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది నెలల్లో అత్యంత తక్కువగా నమోదు : సీఎంఐఈ స్పష్టం
న్యూఢిల్లీ : డిసెంబర్లో నిరుద్యోగ రేటు 4.1 శాతం నమోదు అయిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తెలిపింది. ఈ మేరకు సీఎంఐఈ దేశంలోని అన్ని రాష్ట్రాల నిరుద్యోగ రేటును ప్రకటించింది. తెలంగాణలో డిసెంబర్ నెలలో 4.1 శాతం నిరుద్యోగ రేటు నమోదు అయిందనీ, ఇది గత పది నెలల్లో అత్యంత తక్కువగా నమోదు అని పేర్కొంది. నవంబర్లో 6 శాతం నమోదు అయిన నిరుద్యోగ రేటు, డిసెంబర్ నాటికి 4.1 శాతానికి తగ్గిందని తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ రేటు 7.7 శాతం నమోదు అయింది. అయితే గతనెల నవంబర్ కంటే డిసెంబర్లో నిరుద్యోగ రేటు తగ్గిందని పేర్కొంది. ఏపీలో గతనెల నవంబర్లో 9 శాతం నిరుద్యోగ రేటు నమోదు అయిందని తెలిపింది.