Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాన్య పౌరులతో సమానంగా ప్రజాప్రతినిధులకు వాక్ స్వాతంత్య్రం
- నేతల విద్వేష పురిత వ్యాఖ్యలపై మార్గదర్శకాలు జారీ చేయలేం
- ఈ సమస్యకు పార్లమెంటే పరిష్కారం చూపాలి
- సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజార్టీతో తీర్పు
న్యూఢిల్లీ : ప్రజా ప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. వాక్ స్వాతంత్య్ర హక్కు రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రజా ప్రతినిధులు చేసే వ్యాఖ్యలు రాజ్యాంగ హింసగా పరిగణించబడవని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై అదనపు పరిమితులు విధించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4:1 తేడాతో తీర్పును వెల్లడించింది.
2016 జులైలో తన భార్య, కుమార్తె సామూహిక లైంగికదాడికి గురయ్యారనీ, ఈ కేసుపై విచారణను ఢిల్లీకి బదిలీ చేయాలని ఉత్తర ప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. ఆ బాధితురాలిపై ఉత్తర ప్రదేశ్కు చెందిన అప్పటి మంత్రి ఆజం ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. దీనిని తొలుత త్రిసభ్య విచారించగా, 2017 అక్టోబర్లో రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార సు చేసింది. జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ వి రామ సుబ్రమణియన్, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ 15న విచారణ పూర్తి చేసి, మంగళవారం తీర్పు వెలువరించింది. మెజార్టీ సభ్యుల అభిప్రాయాలతో కూడిన తీర్పును జస్టిస్ బిఆర్ గవాయి చదివి వినిపించారు. ధర్మాసనంలో మెజారిటీ తీర్పుతో జస్టిస్ బివి నాగరత్న విభేదిం చారు. ప్రజా ప్రతినిధులు వాక్ స్వాతంత్రంపై ఆంక్ష లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం నిర్దేశిం చిన దానికంటే ఎక్కువగా ఉండరాదని పేర్కొన్నారు. పౌరులందరికీ వర్తిస్తుం ది. మంత్రులు, పార్లమెంటు సభ్యులు (ఎంపీలు), శాసనసభ సభ్యులు (ఎమ్మెల్యే లు) సభ్యులకు కూడా సామాన్య ప్రజానీకంతో సమా నంగా ఈ హక్కు ఉంటుందని తెలిపారు. అలాంటి ప్రజా ప్రతినిధులు మాట్లాడే ప్రాథమిక హక్కుపై అదనపు ఆంక్షలు విధించబడదని స్పష్టం చేశారు. వాక్ స్వాతంత్య్రం, జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కులకు సంబంధించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ ప్రయివేటు వ్యక్తులకు, ప్రభుత్వేతర శక్తులకు కూడా వర్తిస్తుందని చెప్పారు.
అయితే, ప్రజల ప్రాథమిక హక్కులను ప్రయివేటు వ్యక్తులు ఉల్లంఘించినప్ప టికీ, రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంద న్నారు. పౌర హక్కులకు విరుద్ధంగా మంత్రి చేసిన ప్రకటనలను ప్రభుత్వానికి ఆపాదించలేమని పేర్కొ న్నారు. వారి ప్రకటనలు ఒక వ్యక్తి రాజ్యాంగ హక్కు లను ఉల్లంఘించే చర్యలు, లేదా ఇతర వ్యక్తుల నుంచి లోపాలకు దారితీసి నట్లయితే వారు వ్యక్తి గతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు చేసే వ్యాఖ్యలు రాజ్యాంగ హింస కిందకు రావని, కానీ అది ఒక ప్రజా ప్రతినిధిని తప్పించడం, నేరం చేయడానికి దారితీస్తే అది రాజ్యాంగ హింస అని న్యాయస్థానం వ్యాఖ్యా నించారు. ప్రభుత్వ పదవులను నిర్వహించే వారు సొంతంగా తమపై ఆంక్షలు విధించు కోవాలనీ, ఇది లిఖితపూర్వకంగా లేనటువంటి నిబంధన అని పేర్కొన్నారు. చులకనతో కూడిన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించాలనీ, ఇది రాజకీయ, సామాజిక జీవనంలో ఉండాలని స్పష్టం చేశారు.
జస్టిస్ బివి నాగరత్న అభిప్రాయం
జస్టిస్ బివి నాగరత్న తన అభిప్రాయంతో కూడిన తీర్పు చదివారు. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం ప్రజలకు చాలా అవసరమనీ, ప్రజలకు పరిపాలన గురించి సమాచారం బాగా తెలియాలనీ, పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని, దీని కోసం ఈ హక్కులు అవసరమని తెలిపారు. అయితే ఇది విద్వేష ప్రసంగంగా మారకూడదన్నారు. నేతల విద్వేష పూరిత వ్యాఖ్యలపై మార్గదర్శకాలు జారీ చేయలేమని పేర్కొన్నారు. పార్లమెంటు ఈ సమస్యకు పరిష్కారం చూపాలని అన్నారు. పౌరులపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయకుండా ప్రజాప్రతినిధులను నిరోధించేందుకు పార్లమెంటు తప్పనిసరిగా చట్టాన్ని రూపొందించాలని అన్నారు. రాజకీయ పార్టీలు తమ సభ్యుల చర్యలు, వ్యాఖ్యలను నియంత్రించడానికి ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. విద్వేషపూరిత వ్యాఖ్యల వల్ల పౌరులు ఇబ్బంది పడితే సివిల్ కోర్టులను ఆశ్రయించవచ్చని, నేతల విద్వేషపూరిత ప్రసంగాలు రాజ్యాంగంలోని సోదర భావం, స్వేచ్ఛ, సమానత్వానికి పెద్ద దెబ్బ అని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మరొక పౌరుడిపై ఉంటుందని, ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి భావ ప్రకటన స్వేచ్ఛ ముఖ్యమని స్పష్టం చేశారు.