Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో రౌజ్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఐదుగురు నిందితులకు బెయిలు మంజూరు చేసింది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటుపై మంగళవారం జస్టిస్ ఎంకె నాగ్పాల్ విచారించారు. అనంతరం ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్ల్కె, సమీర్ మహేంద్రులకు రూ. 50 వేలు చొప్పున వ్యక్తిగత పూచీకత్తుతో మధ్యంతర బెయిలు మంజూరు చేశారు. మరోవైపు నిందితుల రెగ్యులర్ బెయిల్పై కౌంటరు దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా వేసింది.